జాతీయ వార్తలు

నిరర్థక ఆస్తులు కాంగ్రెస్ నిర్వాకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సభల్లో పాల్గొన్న షా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)లు పేరుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. రుణాల మంజూరులో అవినీతికి రాజ్యమేలిందని ఆయన విమర్శించారు. ఇవన్నీ గత కాంగ్రెస్ హయాంలో చోటుచేసుకున్నవేనని ఆయన ఆరోపించారు. ఎన్‌పీఏలకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. నాగౌర్ జిల్లా కుఛామన్‌లోశుక్రవారం నాటి ఎన్నికల సభలో మాట్లాడిన అమిత్‌షా ఓ ఆంగ్ల దినపత్రిలోవచ్చిన వార్తను ఉటంకిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. నెహ్రూ-గాంధీ కుటుంబం అధికారంలో ఉండగా కమీన్లు తీసుకుని బడా కంపెనీకి రుణాలు మంజూరు చేసినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కుటుంబానికి చెందిన అల్లుడి కంపెనీకి వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేశారని షా తెలిపారు. బీకనీర్ వద్ద 150 హెక్టార్ల భూమిని కొనుగోలు చేశారని బీజేపీ చీఫ్ ధ్వజమెత్తారు.‘వీటన్నింటికీ సమాధానం చెప్పాలని నేను రాహుల్‌ను అడుగుతున్నా’అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యాకు రుణాలు ఇచ్చారని ఆయన తెలిపారు. నీరవ్, మాల్యా ఉదంతంతో మోదీ సర్కార్‌కు సంబంధం లేదని షా అన్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినా వారు ధైర్యంగా దేశంలోనే ఉండడానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధమే కారణమని బీజేపీ చీఫ్ విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు జైలు తప్పదన్న భయం పట్టుకుని విదేశాలకు పరారయ్యారని షా ఎద్దేవా చేశారు. ఎగవేత దారుల నుంచి ప్రతిపైసా తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.