జాతీయ వార్తలు

రూ. 1300 కోట్ల విలువైన మోనోజైట్ ఖనిజాన్ని తవ్వేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో బీచ్‌శాండ్ మైనింగ్ పేరిట దాదాపుగా 1300 కోట్ల రూపాయల మోనోజైట్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు తనిఖీల్లో వెల్లడైందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ట్రైమెక్స్ సంస్థ ఖరీదైన ఖనిజాలను నిబంధనలకు విరుద్ధంగా తరలించారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా 1300 కోట్ల రూపాయల ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్టు ప్రభుత్వం అలాగే కేంద్ర అటామిక్ ఎనర్జీ విభాగం కూడా మధ్యంతర నివేదికలలో ప్రస్తావించినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ, ట్రైమెక్స్ సంస్థ నుంచి సొమ్ము రికవరికీ సంబంధించి పత్రాలను దాఖలు చేయాలని పిటిషనర్‌కు ధర్మాసనం సుచించింది. వాటిని పరిశీలించిన తరువాత విచారణ తేదీని ఖరారు చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.