జాతీయ వార్తలు

ఈవీఎంల భద్రతపై దృష్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కోరింది. కాంగ్రెస్ నేత, చత్తీస్‌గఢ్ పార్టీ ఇన్‌చార్జి పీఎల పూనియా నాయకత్వంలో ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ)ని కలిసింది. ఎన్నికలు పూర్తయిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రత పరిచిన ఈవీఎంలపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలలోంచి ఓట్లు తొలగించారని ఆరోపించారు. యూపీ ఘటన పునరావృతం కాకుండా ఈసీ తగు భద్రతా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బృందం డిమాండ్ చేసింది. చత్తీస్‌గఢ్‌లోని ధామత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలపై కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. స్ట్రాంగ్ రూంల వద్ద ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పలువురు సంచరిస్తున్నట్టు పూనియా ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీల మరమ్మతుల పేరుతో ఈవీఎంలలోని ఓట్లు తొలగించడానికి కుట్ర జరుగుతోందని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాయ్‌పూర్‌లోని సీఈవోకు ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద సీసీకెమెరాలు పనిచేయడం మానేశాయని కాంగ్రెస్ ఎంపీ వివేక్ టంఖా ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ పూర్తయి 48 గంటలైనా ఈవీఎంలు తరలించలేదని ఆయన కమిషన్ దృష్టికి తెచ్చారు. నెంబర్ ప్లేట్‌లేని స్కూలు బస్సులో సాగర్ కలెక్టరేట్‌కు ఈవీఎంలు తరలించారని కాంగ్రెస్ బృందం వెల్లడించింది. పోలింగ్ అయిన రెండు గంటల్లోనే ఈవీఎంలు తరలించాలని ఆదేశాలున్నప్పటికీ రెండ్రోజులు సమయం తీసుకున్నారని వివేక్ ఆరోపించారు.
ఆ ఈవీఎంలు ఖురియా అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించినవని, అక్కడ రాష్ట్ర హోమ్‌మంత్రి పోటీచేశారని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సర్హాన్‌పూర్ జిల్లాలోని 44 నంబర్ పోలింగ్ బూత్‌కు సంబంధించి ఓట్లు తొలగింపబడ్డాయని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు. అక్కడ అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఓ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లే గల్లంతయ్యాయని ఈసీకి తెలిపారు. యూపీ సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సింఘ్వీ కోరారు. ఈవీఎంల భద్రత, స్ట్రాంగ్ రూంల విషయంలో కఠినంగా ఉంటామని ఈసీ హామీ ఇచ్చినట్టు అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు.