జాతీయ వార్తలు

అమ్మో.. నేను భారత్ రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అవన్నీ సాకులే: కొట్టిపారేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ముంబయి, డిసెంబర్ 1: తాను భారత్‌కు వచ్చే ప్రసక్తిలేదని ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ తేల్చి చెప్పాడు. తాను ఒక వేళ భారత్‌కు తిరిగివస్తే రావణుడి చంపినట్లు వెంటాడి చంపుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఆయన తరఫున న ఆయయవాది శనివారం ఇక్కడ ముంబయి కోర్టులో వెల్లడించారు. కాని నీరవ్ మోదీ భయాలు అర్థ రహితమని, భద్రతాపరమైన ముప్పు ఉంటే, పోలీసు ఫిర్యాదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. శనివారం ఇక్కడ మనీలాండరింగ్ కేసులను విచారించే కోర్టులో నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ తన క్లైంట్ వ్యక్తం చేసిన భయాందోళనలను తెలిపారు. ఈ కేసును న్యాయమూర్తి ఎంఎస్ ఆజ్మీ విచారిస్తున్నారు. తాను చెప్పదలుచుకున్న సమాచారాన్ని న్యాయవాది ద్వారా కోర్టుకు నీరవ్‌మోదీ తెపారు. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాత్రం నీరవ్ మోదీ తెలిపిన సమాచారంలో నిజం లేదని పేర్కొంది. తాము పంపిన మెయిల్స్‌ను నీరవ్‌మోదీ స్వీకరిస్తున్నారని, కాని కాని దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు. భారత్‌కు రాకుండా మొరాయిస్తున్నారన్నారు. తన క్లైంట్ భధ్రతపరమైన సమస్యల వల్ల భారత్‌కు రావడానికి నిరాకరిస్తున్నారని న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. ‘ మోదీ 50 అడుగుల దిష్టిబొమ్మను తగులబెట్టారు. భారత్‌లో మూక హింస కూడా ఉంది. నన్ను ఒక దెయ్యంతో, రావణుడితో పోల్చుతున్నారు అని తన క్లైంట్ ఆందోళనతో ఉన్నట్లు న్యాయవాది తెలిపారు. 2018 జనవరి 1వ తేదీన నీరవ్ మోడీ భారత్ నుంచి తప్పించుకుని వెళ్లాడు. దేశం నుంచి వదిలివెళ్లే సమయంలో నీరవ్ మోదీపై కేసులు లేవు. విజయ్ మాల్యాలాగా నీరవ్ మోదీ దేశం వదిలివెళ్లేటప్పుడు నిరర్థక ఆస్తులు లేవన్నారు. మోదీ ఒక ఆభరణాల డిజైనర్ అని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడిగే ఆర్థిక సమాచారాన్ని ఇవ్వలేరని న్యాయవాది అగర్వాల్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14వేల కోట్ల రుణాలను ఎగగొట్టి నీరవ్ మోదీ గత ఏడాది దేశం వదిలి పారిపోయారు.