జాతీయ వార్తలు

అవాస్తవాల ప్రచారం మానుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రాఫెల్ జెట్ కొనుగోళ్లపై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేయడం మానుకోవాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హితవుచెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని, వారసత్వ రాజకీయాలతో కుళ్లి కంపుకొడుతోందని, రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అబద్ధాలను ప్రచారం చేసే స్థాయికి దిగజారిందని ఆయన ఘాటుగా విమర్శించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన మహాకూటమి మహాజూట్ కూటమి అని ఆయన ఫేస్‌బుక్‌పోస్టులో ఎద్దేవా చేశారు. ఈ వివాదంలో సంబంధంలేని సీనియర్ బ్యూరోక్రాట్లను లాగడం బాధాకరమన్నారు. ప్రస్తుతం కాగ్‌లో ఉన్న మెహ్రిషీ గతంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారన్నారు. రాఫెల్ కొనుగోళ్ల వ్యవహారంతో ఆ అధికారికి సంబంధంలేదన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెహ్రిషీకి రాఫెల్‌ఫైళ్లు చేరలేదన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న థియరీలను ప్రజలు, ఇతర పార్టీలు నమ్మడం లేదన్నారు. నమ్మశక్యం కాని విషయాలను అభూతకల్పనలతో ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటైందన్నారు. రాఫెల్‌పై రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినందుకు సుప్రీంకోర్టును కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. మీడియా కూడా అవాస్తవాలతో కూడిన డాక్యుమెంట్లను ప్రచురిస్తున్నాయన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రాహుల్ గాంధీని అదుపు చేయడంలో కాంగ్రెస్ సీనియర్లు విఫలమయ్యారని ఆయన అన్నారు.