జాతీయ వార్తలు

రాజుల వైభవం చాటే హంపీ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జనవరి 9: విజయనగర రాజుల వైభవాన్ని చాటే హంపీ ఉత్సవాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. శుక్ర, శనివారం జరిగే ఈ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచే గాక దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కన్నడ సాంస్కృతిక, ప్రవాసోద్యమశాఖ, జిల్లా పాలన యంత్రాంగం సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుక్రవారం ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం హంపీ పురవీధుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం రాత్రి శ్రీకృష్ణదేవరాయ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సంగప్ప సవది, ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు, కన్నడ సాంస్కృతిక, ప్రవాసోద్యమ మంత్రి సీటీ.రవి ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. జిల్లా పంచాయితీ అధ్యక్షులైన సి.్భరతి తిమ్మారెడ్డి, లోకసభ సభ్యులు వై. దేవేంద్రప్ప, కొప్ళళ ఎంపీ కరడి సంగణ్ణ, సయ్యద్ నాసిర్ హుసేన్, హడగలి పిటి.పరమేశ్వర్‌నాయక్, సండూరు ఎమ్మెల్యే ఈ.తుకారం, హగరిబొమ్మనహళ్ళి ఎమ్మెల్యే భీమానాయర్, కె.సి.కొండయ్య, అల్లం వీరభద్రప్ప, బళ్ళారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, సిరుగుప్ప ఎమ్మెల్యే సోమలింగప్ప తదితరులు పాల్గొంటారు.

'చిత్రం... హంపీలోని రాతి రథం