జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలే దేశానికి మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: జమిలి ఎన్నికలు దేశానికి మేలు చేస్తాయని, అన్ని రాజకీయ పార్టీలూ అందుకు కలిసి రావాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఎస్‌బీలో జరిగిన సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల రాజకీయపార్టీలకు ఎలాంటి నష్టం ఉండదని, లాభమే ఉంటుందని, అలాగే దేశానికి కూడా ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరగడం వల్ల అపరిమితమైన ధన వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలకు కొన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని, వాస్తవికంగా జమిలి ఎన్నికలు అందరికీ లాభమేనని అన్నారు. నిరంతరం ఎన్నికలు కొనసాగేబదులు ఎన్నికలు కొద్ది రోజులు జరిగితే మిగిలిన కాలాన్ని దేశాభివృద్ధికి ప్రభుత్వాలు వెచ్చించగలుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎక్కువ కాలం కొనసాగితే వ్యయం పెరుగుతుందని, పార్టీలు సైతం పెద్ద ఎత్తున వెచ్చిస్తాయని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మించిది కాదని అన్నారు.
1967 నుండి చూస్తుంటే దేశంలో తరచూ ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల సంస్కరణలు రావల్సి ఉందని ఏకకాల ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదనలు వస్తున్నా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఏకకాల ఎన్నికల ఆలోచనను తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఎన్నికలు నిర్వహించడం, రాజకీయపార్టీలు ఖర్చు చేయడం వంటి అనేక సమస్యలను అధిగమించడానికి చర్చ జరగాలని అన్నారు. ఈ ప్రతిపాదనను లోతుగా పరిశీలించి , ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని రాజకీయపార్టీలను ఆయన కోరారు. కొన్ని రాజకీయ పార్టీల్లో భయాలున్నాయని, ఏకకాల ఎన్నికలు మంచి మద్దతు, నాయకత్వం ఉన్న పార్టీలకు ఎక్కువ మేలు జరుగుతుందనే భయాలున్నాయని కానీ భారతీయ ఓటరు ఎపుడూ ఎన్నికల సమయంలో తన పరిపక్వతను ప్రదర్శిస్తునే ఉంటారని పేర్కొన్నారు. గత 70 ఏళ్లుగా లోతైన సాంస్కృతిక మూలాలతో దేశంలో ప్రజాస్వామ్యం స్థిరీకరించబడిందని ఉప రాష్ట్రపతి పేర్కొంటూ గుర్తింపు ఆధారిత ఓటింగ్‌ను నిర్మూలించడం, నగదు కోసం ఓటు వేసే విధానం పోవాలని పేర్కొన్నారు. 2022లో స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని జరపుకోవడం కంటే ముందు దేశ రాజకీయాల్లో ధన ప్రభావాన్ని తగ్గించే కొన్ని ప్రభావవంతమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
'చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు