జాతీయ వార్తలు

జనాకాంక్షను ప్రతిబింబిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రజానుకూల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తుందనే ఆశాభావాన్ని బిజెపి సీనియర్ నాయకులు వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బిజెపి కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ సీనియర్ నాయకులతో బడ్జెట్ ముందస్తు చర్చలు జరిపారు. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ 2020-21 వార్థిక ప్రణాళికను ప్రతిపాదిస్తారు. గత వారం, పది రోజుల నుండి సమాజానికి చెందినన వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, నిపుణులతో బడ్జెట్ ఆమె ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బిజెపి కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాన కార్యదర్శులు బి.ఎల్.సంతోషీ, భుపేందర్ యాదవ్, అరుణ్‌సింగ్ తదితరులతో సమాలోచనలు జరిపారు. బడ్జెట్‌లో ఏ ఏ అంశాలను పొందుపరిస్తే బాగుంటుందన్న దానిపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బడ్జెట్ ఎలా ఉండాలనే అంశంపై అన్ని వర్గాలతోనూ బీజేపీ నేతలు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రైతులు, కార్మిక సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులతో మంతనాలు సాగించారు. ఈ చర్చల సారాంశాన్ని తాము ఆర్థిక మంత్రికి వివరించామని అరుణ్‌సింగ్ సమావేశానంతరం విలేకరులతో చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రజానుకూల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని తాము విశ్వసిస్తున్నామని ఆయన తెలిపారు. బిజెపి వివిధ సంఘాల నాయకులతో జరిపిన చర్చల గురించి ఆర్థిఖ శాఖ మంత్రికి వివరించామని పార్టీ అధికార ప్రతినిధి గోపాల కృష్ణ అగర్‌వాల్ చెప్పారు. బడ్జెట్ ఎలా ఉండాలనే అంశంపై తామింత వరకు వివిధ సంఘాల నాయకులతో ఏడు సమావేశాలు జరిపామని, మరో నాలుగు సమావేశాలు జరిపిన అనంతరం ప్రజల ఆకాంక్షలకు సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేసి కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఇస్తామని ఆగర్వాల్ చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా తయారు చేసే నోట్‌ను ఆర్థిక మంత్రికి పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు నడ్డా అందిస్తారని తెలిపారు.