జాతీయ వార్తలు

ప్రజలు ఉండమంటున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, జనవరి 16: ‘నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని చాలా మంది భావించారు. అయితే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత అందుకు సుముఖంగా లేరు. నేను ఇంకా క్రీయాశీల పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు’అని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్రంలో శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన శరద్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఏర్పాటైన వ్యవసాయ ప్రదర్శనలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు శరద్ పవార్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్, డిప్యూటీ సీఎం అజిత్ ఎన్‌సీపీ అధినేతకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పవార్ సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.‘ప్రసంగానికి ముందే నాకు పుష్పగుచ్ఛాలు అందజేశారంటే(ఉద్ధవ్,అజిత్) నన్ను రిటైర్ అవ్వమని చెబుతున్నాటుగా భావిస్తున్నాను. నిజంగా వారు అలా అనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’అని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా ‘ఎందరో నేను రిటైర్ కావాలని(రాజకీయాల నుంచి) అనుకుంటున్నారు. అయితే అది జరగడం లేదు. కారణం..మహారాష్ట్ర ప్రజలు, యువత నేను రిటైర్ కావడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు’అని ఎన్‌సీపీ అధినేత స్పష్టం చేశారు. కొందరు ఆశించినట్టు రిటైర్ కావడం అయ్యేపని కాదని ఆయన అనేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి కలిసే పోటీ చేసినా ఫలితాల తరువాత పొత్తు చెడింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయినా దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినా బలపరీక్షకు ముందే సర్కార్ కూలిపోయింది. ఈనేపథ్యంలో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ రాజకీయ చాణక్యం ఫలించింది. శివసేన-ఎన్‌సీపీ- కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(ఎంవీఏ) అధికారంలోకి వచ్చింది. పవర్ తనకున్న రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి భిన్న ధ్రువాలైన మూడు పార్టీలను ఓ తాటిపైకి తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకోవడంతో వ్యవసాయ రంగంలో దిగుబడులు పెరిగాయని శరద్ పవార్ చెప్పారు. అధిక జనాభాగల భారత్ వంటి దేశంలో ఎక్కువ మంది వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసి ఉత్పత్తులను పెంచుకోవల్సిన అవసరం ఉందని ఎన్‌సీపీ అధినేత పేర్కొన్నారు. పరిశోధన ఫలాలు కింది స్థాయి రైతులకు చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా పరిశోధనలు జరుపుకోడానికి శాస్తవ్రేత్తలకు అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జన్యుపరమైన మార్పులపై పరిశోధనలకు ఆంక్షలున్నాయని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆంక్షలను ఆయనీ సందర్భంగా ప్రస్తావిస్తూ ‘న్యాయమూర్తుల అభిప్రాయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఇలాంటి విషయాల్లో వారు జోక్యం చేసుకోవడమే మంచిదన్నది నా అభిప్రాయం’అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. హానికరమైన వాటిని ఆపేయాలన్న దానికి తానెలాంటి అభ్యంతరం చెప్పనని ఆయన అన్నారు. కొనే్నళ్ల క్రితం చెరకులో కొత్త వంగడం కనుగొన్నారని ఆయన గుర్తుచేశారు. తక్కువ నీటితో చెరకు సాగుకు ఆస్కారం కలిగించే పరిశోధనలవి. ‘ఇండోనేసియాకు మన శాస్తవ్రేత్తలను పరిశోధనల నిమిత్తం పంపాం. అక్కడ సాగుపద్ధతులపై అధ్యయనం చేసి వచ్చారు. దేశంలో అమలుకు ప్రయత్నించగా న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో మా ప్రయత్నం అంతా విఫలమైంది’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'చిత్రం... ఎన్‌సీపీ నేత శరద్ పవార్