జాతీయ వార్తలు

భారతీయ జీవనం.. శాంతికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ద్వేషం, ఉగ్రవాదం, సంఘర్షణలు, ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న ప్రపంచానికి భారత జీవన విధానమే ఆశాకిరణమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శాంతి, సంయమనమే భారత నాగరిక వికాసానికి గీటురాళ్లని అన్నారు. ‘ప్రపంచీకరణ-్భరతీయ ఆలోచన’అన్న అంశంపై గురువారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఓ సెమినార్‌నుద్దేశించి వీడియో ద్వారా మాట్లాడిన మోదీ ‘సంఘర్షణల నివారణకు భారత్ అనుసరించే పథం చర్చా మార్గమే’నన్నారు. అరమరికల్లేని వాతావరణంలోనే భిన్నాభిప్రాయాలకు గౌరవం, వినూత్న ఆవిష్కరణలకు అవకాశం లభిస్తాయని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు చేయాలన్న భారతీయ ఉత్సాహం, జిజ్ఞాసే ప్రపంచ దేశాలను తమవైపు మళ్లిస్తోందని మోదీ తెలిపారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వ భావత వంటి సుగుణాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు, అలవాట్లు, మత విశ్వాసాలు తరతరాలుగా పెనవేసుకుని శాంతియుతంగానే భారత్‌లో మనుగడ సాగిస్తున్నాయన్నారు.అనేక నాగరికతలు కనుమరుగైపోయినా భారతీయ నాగరికత ఉజ్వలంగా కొనసాగడానికీ ఇక్కడి శాంతి, సామరస్యాలే ప్రధాన హేతువులన్నారు. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దశాబ్దాలుగా చేస్తున్న కృషికి భారత్ నిరుపమాన రీతిలో సహకరిస్తోందని పేర్కొన్న మోదీ ‘సంఘర్షణలతో సతమతమైన ప్రాంతాలు ఎక్కడ శాంతి శ్వాసలు తీసుకుంటున్నాయంటే అక్కడ భారత జవాన్ల పాత్ర కూడా ఉండటమే కారణం’అని అన్నారు. సమస్యల వలయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వర్తమాన ప్రపంచానికీ భారత జీవన విధానమే శాంతి సోపానమని మోదీ హితవు పలికారు. ప్రపంచ దేశాల్లో దేనికీ లేని జాజ్వల్య యువశక్తి భారత్‌కు ఉందని అందుకే ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని అన్నారు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు, సార్ట్‌అప్‌లు భారత యువశక్తికి సంకేతాలని, అందుకే అంతర్జాతీయంగా భారత ఖ్యాతి రోజురోజుకూ విస్తరిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

'చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ