జాతీయ వార్తలు

పీసీసీ కొత్త సారథి శైలజా నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు శైలజా నాథ్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడుగా నియమించారు. ఎన్. తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీను కార్యనిర్వాహక అధ్యక్షులుగానియమించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పాత పీసీసీ చేసిన సేవలను ప్రశంసించారని వేణుగోపాల్ తన ప్రకటనలో తెలిపారు. పీసీసీకి ఇంత కాలం అధ్యక్షుడుగా పని చేసిన ఎన్ రఘువీరా రెడ్డి కొంత కాలం క్రితం తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఆయన రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అయతే, సోనియా ఆయన రాజీనామా లేఖను వెంటనే ఆమోదించలేదు. రఘువీరారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై
ఆమె రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత శైలజానుథ్‌ను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే రాయలసీమ ప్రాంతానికి చెందిని ఇద్దరు నాయకులు శైలజానాథ్, తులసి రెడ్డికి అధ్యక్ష, కార్యినిర్వాహక అధ్యక్ష పదవి లభించటం గమనార్హం. రెండో కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు.
తెలంగాణ పీసీసీ
సోనియా గాంధీ త్వరలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది, పలువురు సీనియర్, యువ నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వారు చెబుతున్నారు.
'చిత్రం... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త సారథి శైలజా నాథ్