జాతీయ వార్తలు

సీఏఏ కింద దరఖాస్తుకు అస్సాంలో 3నెలల గడువు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: కొత్తగా రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద అస్సాంలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు గురువారం తెలిపారు. సీఏఏ అమలు కోసం జారీ చేయనున్న నిబంధనలలో ప్రత్యేకంగా అస్సాంకు సంబంధించిన కొన్ని నిబంధనలను కలిపే అవకాశం ఉంది. అస్సాంలో జీవిస్తున్న వారు సీఏఏ కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్వల్పంగా కేవలం మూడు నెలల సమయం ఇచ్చే అవకాశం ఉందని ఈ అంశాలతో సంబంధం ఉన్న ఒక అధికారి చెప్పారు. పార్లమెంటు డిసెంబర్‌లో ఈ కొత్త చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనలు కొనసాగుతున్నాయి. వచ్చే రెండు వారాలలో సీఏఏ నిబంధనలను జారీ చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు.