జాతీయ వార్తలు

తప్పదు..అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 18: పౌరసత్వం అంశం కేంద్ర జాబితాలోనిదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఏఏను అమలు చేయకుండా అడ్డుకోలేవని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుచేయకుండా ఏ రాష్ట్ర తప్పించుకోజాలదని శనివారం ఇక్కడ ఉద్ఘాటించారు. ‘సీఏఏ అమలుచేయడం తప్ప మరో మార్గం లేదు. రాజ్యాంగంలోని 254 ఆధికరణ కింద రాష్ట్రాలు అమలుచేసి తీరాల్సిందే’అని ఆయన నొక్కిచెప్పారు. సీఏఏను కొన్ని రాష్ట్రాలు అమలుచేయడానికి నిరాకరిస్తున్న విషయం గవర్నర్ ఖాన్ దృష్టికి తీసుకురాగా ‘ప్రతి ఒక్కరికి అధికార పరిధి ఉంటుంది’అని బదులిచ్చారు. ‘మీ వాదనలు సుప్రీం కోర్టులో వినిపించండి. సీఏఏను సవాల్ చేసే అధికార మీకుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టం అంశం కేంద్ర జాబితాలోనిది’అని కేరళ గవర్నర్ స్పష్టం చేశారు. పౌరసత్వం అంశం రాష్ట్రాల పరిధిలోనిది కాదని ఆయన పునరుద్ఘాటించారు. జైపూర్‌లోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ‘ఏ అంశంపైన అయినా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉంది. అదే సమయంలో చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎంతమాత్రం లేదు’అని అన్నారు. కేరళ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. స్వేచ్ఛా, సమానత్వాలను ఉల్లంఘించేదిగా సీఏఏ ఉందని కేరళ ప్రభుత్వం వాదిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక వాదాన్ని కేంద్రం మంటగలుపుతోందని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇలా ఉండగా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించడంమై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తనకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మరోపక్క పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాము కేరళ బాటలోనే నడుస్తామని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం సీఏఏకు వ్యతిరేంగా ఓ తీర్మానం చేసిన పంజాబ్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని వెల్లడించింది. తాము కేరళ బాటలోనే సీఏఏపై సుప్రీంలో పోరాడతామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు.