జాతీయ వార్తలు

రాజకీయాలతో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరాదాబాద్ (యూపీ), జనవరి 18: ‘రాజకీయాలతో మాకేమీ సంబంధం లేదు... 130 కోట్ల భారతీయుల కోసమే పని చేస్తాం..’ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. దేశంలోని భారతీయుల కోసం, విలువలు పెంచేందుకు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మూడు రోజుల పాటు స్వయం సేవకుల కోసం ఏర్పాటైన కార్యక్రమాలు శనివారం ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోహన్ భగవత్ స్వయం సేవకులనుద్ధేశించి ప్రసంగిస్తూ అన్ని మతాలకు చెందిన వారు సంఘ్‌లో సభ్యులుగా ఉన్నారన్నారు. అయితే వీరిలో కొంత మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారని ఆయన తెలిపారు. ఆ రాజకీయ పార్టీలతో, ఎన్నికలతో తమకు సంబంధం ఏమీ లేదన్నారు. గత 60 సంవత్సరాలుగా దేశంలో నైతిక విలువలు పెంచేందుకు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. బీజేపీని నడిపించే రిమోట్ కంట్రోలు ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని భగవత్ తోసిపుచ్చారు. తాము దేశంలోని 130 కోట్ల మంది ప్రజల బాగోగుల కోసం పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరవచ్చన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన వారు నిత్యం శాఖలో పాల్గొనకపోయినా, జాతి సమగ్రత, సిద్ధాంతాల కోసం పని చేయవచ్చని అన్నారు. భూదాన్ ఉద్యమ వ్యవస్థాపకుడు వినోభాభావే, ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వర్కర్ సంఘ సంస్కర్తలని ఆయన తెలిపారు. ఇంకా అనేక మంది సంఘ సంస్కర్తలు కూడా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం, సిద్ధాంతాలకు అనుగుణంగానే పని చేస్తున్నారని మోహన్ భగవత్ చెప్పారు. ఇలాఉండగా భగవత్ తన ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్ట్రి (ఎన్‌ఆర్‌సీ)ల గురించి ప్రస్తావించ లేదు.

'చిత్రం... ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడి