జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీకి ముసుగే ఎన్‌పీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 18: జాతీయ జనాభా పట్టిక అన్నది ఎన్‌ఆర్‌సీకి వేసిన ముసుగేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం అన్నారు. అస్సాంలో పౌరసత్వ జాబితా వ్యవహారం విఫలం కావడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడు జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) బాట పట్టిందని ఆయన విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఎన్‌పీఆర్, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) హక్కు రాష్ట్రాలకు ఉందని, అందుకు కారణం ఈ రెంటింటి చెల్లుబాటును నిర్దారించాల్సింది సుప్రీంకోర్టు అని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలుచేయ తలపెట్టిన ఎన్‌పీఆర్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని, అలాగే పౌరసత్వ చట్టంపై కూడా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. వీటితోపాటు ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలిపి కేంద్రంపై ఉమ్మడిగా పోరాటం సాగించాలని అన్నారు. ఎవరు ఏ మార్గంలో వెళ్లినా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ మూడింటినీ వ్యతిరేకిస్తున్నాయని, మొత్తానికి ప్రజాబాహుళ్యంలో వీటి పట్ల పూర్తి వ్యతిరేకత ఉందన్న విషయం స్పష్టమవుతోందని చిదంబరం అన్నారు. వీటిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేపట్టిన తీర్మానాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని ఆయన తెలిపారు. వీటిని రాష్ట్రాలు వ్యతిరేకించడంలో రాజ్యాంగపరమైన ప్రతికూలత ఏమీ లేదని ఆయన వివరించారు. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన సమావేశానికి హాజరుకాని ప్రతిపక్ష పార్టీలు భవిష్యత్తులో కలసి పనిచేయగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
'చిత్రం... సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై శనివారం కోల్‌కతాలో జరిగిన ఓ నాయకత్వ శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న చిదంబరం