జాతీయ వార్తలు

కేవలం హక్కే కాదు.. బాధ్యత కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్: పౌరసత్వం అంటే కేవలం హక్కులకు సంబంధించినది కాదని, బాధ్యతలను కూడా తెలియజేసేదేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరత్ బాబ్డే స్పష్టం చేశారు. సమాజం పట్ల ప్రతి పౌరుడు తాను నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలియజేసేదే పౌరసత్వమని ఆయన తెలిపారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ 107 స్నాతకోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వ్యక్తిత్వంతోపాటు గుణాత్మకమైన ఆలోచనలను పాదుగొల్పేదే నిజమైన విద్య అని అన్నారు. అయితే, కొన్ని విద్యాసంస్థలు పూర్తిగా వాణిజ్యమయంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు కాకపోయినా కొన్ని విద్యాసంస్థలు విద్యా బోధన కంటే కూడా వ్యాపార పరంగా లాభాలు గడించడమే పనిగా పెట్టుకున్నాయని వ్యక్తిగతంగా తనకున్న అవగాహనతోనే తాను ఈ మాటలు అంటున్నానని బాబ్డే తెలిపారు. విశ్వవిద్యాలయాల నుంచి పొందే డిగ్రీలు మరో కొత్త ప్రయాణానికి మార్గాన్ని చూపేవేనని, డిగ్రీలతోనే అంతా అయిపోయిందనుకుంటే పొరపాటని అన్నారు. విశ్వవిద్యాలయాలు సమాజ వౌలిక ఆశయాలు, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పునశ్చరణ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలివితేటలను పెంపొందించడంతోపాటు వ్యక్తిత్వాన్ని కూడా క్షమశిక్షణాయుతంగా నిర్మింపజేసేదే అసలైన విద్య అని అన్నారు.
అలాగే పరిశోధన, సృజనాత్మకత అన్నవి కూడా ఈ విషయంలో అత్యంత కీలకమని, వీటివల్లే ప్రతీ పౌరుడు సమాజానికి తోడ్పడగలుగుతాడని అన్నారు. ‘విశ్వవిద్యాలయం ఇచ్చే డిగ్రీ అన్నది ఓ వ్యక్తి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి లభించిన సాధనమే. ఈ సాధనంతో ఆ వ్యక్తి తన భవితను ఎలా తీర్చిదిద్దుతాడన్నది అతడి ఆలోచన, విజ్ఞత, వ్యక్తిత్వంపైనే ఆధారపడి ఉంటుంది’ అని బాబ్డే అన్నారు.
'చిత్రం... సుప్రీం సీజే బాబ్డే