జాతీయ వార్తలు

పౌర చట్టం అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: భారత ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), అలాగే ప్రతిపాదిత జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)లు పూర్తిగా ఆ దేశా ఆంతరంగిక వ్యవహారాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. అయితే, ఈ రెండు కూడా ఎంతమాత్రం అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి మత వేధింపుల కారణంగా భారత్ వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో సీఏఏని మోదీ సర్కారు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటిపై భారత్‌లో తీవ్ర స్థాయిలో వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడిన హసీనా ‘్భరత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందో మాకు అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. గల్ఫ్ న్యూస్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన హసీనా ఈ పౌరసత్వ చట్టం గురించి మాట్లాడారు. ఇంతకుముందే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు భారతదేశ సొంత అంశాలని బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మెమెన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో వీటిపై భారత్‌లో నెలకొన్న అనిశ్చితి ప్రభావం తమ దేశంపైన కూడా పడుతుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో 161 మిలియన్ మంది జనాభాలో 10.7 శాతం మంది హిందువులు కాగా, 0.6 శాతం మంది బౌద్ధ మతస్థులు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు కూడా మత వేధింపుల కారణంగా భారత్‌కు తరలి వెళ్లలేదని ఈ ఇంటర్వ్యూలో హసీనా స్పష్టం చేశారు. అలాగే భారత్ నుంచి తిరిగి బంగ్లాకు మైనారిటీలు తరలివచ్చినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తెలిపారు. భారత్‌లోనే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికి కూడా సీఏఏను ఆ దేశ ఆంతరంగిక అంశంగానే తాము భావిస్తున్నామని ఆమె ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అనేక రంగాల్లో విస్తృతంగా సహకారం కొనసాగుతోందని, ద్వైపాక్షిక సంబంధాలు కూడా సుహృద్భావ రీతిలోనే ఉన్నాయని ఆమె తెలిపారు.
'చిత్రం... బంగ్లా ప్రధాని హసీనా వ్యాఖ్య