జాతీయ వార్తలు

వైఫల్యాలే విజయానికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పరీక్షల్లో మంచి మార్కులు రావడం సర్వస్వం కాదు, ఈ మైండ్ సెట్ నుండి బయటపడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నరంద్ర మోదీ సోమవారం టల్కటోరా స్టేడియంలో జరిపిన పరీక్షపై చర్చ అనే కార్యక్రమంలో దేశంలోని నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఇష్టాగోష్టి చర్చలు జరిపారు. నలభై మంది దివ్యాంగులు కూడా పాల్గొన పరీక్షపై చర్చ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు వివిధ ఆంశాలపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు విద్య అనేది ఒక మార్గం, సాధనం, మనం కొత్త విషయాల గురించి తెలుసుకుంటూనే ఉండాలని ఆయన చెప్పారు. వైఫల్యాలు మనసును కుంగదీయకూడదు, వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప ఎంత మాత్రం కుంగిపోకూడదని ప్రధాని మోదీ సూచించారు. వైఫల్యానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులను విశే్లషించడం, అర్థం చేసుకోవడం ద్వారా వాటిని అదిగమించాలని నరేంద్ర మోదీ హితవు చెప్పారు. ఉత్సాహంతో ఉండటం, కుంగిపోవడం విద్యార్థులకు సర్వసామాన్యం అని ఆయన ఒక బాలిక అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. వైఫల్యాలు విజయానికి సోపానాలు కావాలంటూ ఆయన చంద్రయాన్ వైఫల్యాన్ని ఉదహరించారు. చంద్రుడిపై పరీక్షలు నిర్వహించేందుకు లాండర్‌ను దించేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు జరిపిన చంద్రయాన్ పరీక్ష విజయవంతం కాకపోవచ్చు కాబట్టి ఇస్రోలో చంద్రయాన్ పరీక్షకు వెళ్లకూడదని చాలా మంది తనకు సలహా ఇచ్చారని మోదీ వెల్లడించారు. వైఫల్యం
ముఖ్యం కాదు, వైఫల్యం నుండి గుణపాఠం నేర్చుకోవటం మఖ్యం అందుకే తాను చంద్రయాన్ పరీక్షను చూసేందుకు ఇస్రోకు వెళ్లడంతో పాటు పరీక్ష విఫలమైన తరువాత కూడా తాను అక్కడి శాస్తవ్రేత్తలతో మాట్లాడినట్లు ప్రధాని మోదీ చెప్పారు. వైఫల్యాలతో భయపడితే విజయాలు సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వైఫల్యంలో తనకు విజయం కనిపిస్తుందని ఆయన మరో ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. బహిర్గత కారణాల మూలంగానే పరీక్షల సమయంలో విద్యార్థుల మూడు చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్జనతో పాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలంటూ ఎక్ట్స్రా-కర్రిక్యులర్ కార్యకలాపాలు లేకపోతే విద్యార్థులు రొబోట్‌లా తయారవుతారని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఎక్ట్రా-కర్రిక్యులర్ కార్యకలాపాలు ఆకర్శణీయంగా ఉండాల్సిన అవసరం లేదంటూ విద్యార్థులు తమకు ఇష్టమైన కార్యకలాపాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఒకసారి విఫలమైనంత మాత్రాన విజయం దరిదాపుల్లో లేదని అర్థం కాదన్నారు. విఫలం చెందడం అంటే మనలోని సామర్థ్యం ఇంకా బయటకు రాలేదన్న అర్థమని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రయాన్ వైఫల్యం గురించి మాట్లాడుతూ దేశ ప్రజలు ఇస్రో నుండి ఏం కోరుకుంటున్నారనేది తాను శాస్తవ్రేత్తలకు వివరించానని ఆయన తెలిపారు. ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్న కృషిని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ ప్రతి వైఫల్యం నుండి గుణపాఠం నేర్చుకోవాలి, విజయానికి సోపానాలు కావాలని ప్రధాని మోదీ చెప్పారు. 2001లో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ సీరీస్ గురించి మాట్లాడుతూ అందరి మూడు చెడిపోయింది, పరిస్థితి అదుపుతప్పుతుందనుకుంటున్న సమయంలో రాహుల్ ద్రావిడ్, వి.వి.లక్ష్మణ్ ఏం చేశారనేది మరిచిపోగలమా? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను వారు మలుపు తిప్పలేదా అని ప్రధాని ప్రశ్నించారు. అనీల్ కుంబ్లే గాయంతో బౌలింగ్ చేయడం వంటి సంఘటనలు మనందరిని ఉత్తేజపరచడంతో పాటు సహేతుక ఆలోచనకు ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల మూలంగా కలిగే నష్టం గురించి మాట్లాడుతూ సాంకేతిక పరిజానం మన అదుపులో ఉండేలా చూసుకోవాలని ఆయన విద్యార్థులకు హితవు చెప్పారు. టెక్నాలజీ మూలంగా మన విజానం పెరగాలి తప్ప సమయం వృధా కాకూడదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రతి రోజు ఒక గంట పాటు మొబైల్, తదితర గాడ్జెట్‌లకు దూరంగా ఉండటంతో పాటు ఈ గంట సమయాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పుస్తకాలు, పెంపుడు జంతువులతో గడపాలన్నారు. విద్యార్థులు వీలుంటే ఒక గంట పాటు తోట పని చేయాలని ఆయన ప్రతిపాదించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల బాధ్యతలపై దృష్టి పెట్టాలని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. 2020 కేవలం ఒక కొత్త సంవత్సరమే కాదు ఒక కొత్త దశకం అంటూ ఈ పది సంవత్సరాల్లో విద్యార్థులు దేశాభివృద్దికి తోడ్పడాలన్నారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో‘పరీక్షపై చర్చ-ఎగ్జామ్ వారియర్’ పుస్తకాన్ని చదివి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని మోదీ సూచించారు.
'చిత్రం...‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ