జాతీయ వార్తలు

కమల ‘దళపతి’గా జేపీ నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: అందరూ ముందే ఊహించినట్లు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్ష పదవికి జేపీ నడ్డా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణాధికారి రాధామోహన్ సింగ్ సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు. జగత్ ప్రకాశ్ నడ్డా గత సంవత్సరం నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపడతారు. ముగ్గురు బీజేపీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా పేరును ప్రతిపాదించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన హిమాచల్ ప్రదేశ్ సీనియర్ నాయకుడు నడ్డా ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసన సభకు జరగనున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతతో పార్టీ అధ్యక్ష పదవి చేపడుతున్నారు. ఢిల్లీ శాసనసభ గత ఎన్నికల్లో ఆం ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంటే బీజేపీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుపొందింది. అయితే ఆ తరువాత లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోకసభ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్-370, ఆర్టికల్-35 ఏ రద్దు, త్రిపుల్ తలాక్ చట్టం, సీఏఏ చట్టం వచ్చిన నేఫథ్యంలో దేశ రాజదాని ఢిల్లీ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు
అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గట్టి పోటీ ఇస్తున్న ఆం ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంలో నడ్డా విజయం సాధిస్తే పార్టీలో ఆయన పలుకుబడి బాగా పెరుగుతుంది. ఎన్నికల రాజకీయాల్లో బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయిన మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు నడ్డా నాయకత్వంలో బీజేపీ ఢిల్లీ శాసన సభను గెలుచుకుంటుందా? అనేది ప్రశ్న. 2014, 2019 లోకసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ తన విజయపరంపరను శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో పునరావృతం చేయలేకపోయింది. అందుకే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొన్ని నెలలకే బిహార్ శాసన సభ ఎన్నికలు సమీపంలో ఉంటాయి. ఢిల్లీలో ఆం ఆద్మీ పార్టీని ఓడించి బిహార్‌లో జేడీ(యు) నాయకుడు నితీష్ కుమార్‌తో కలిసి అధికారాన్ని నిలుపుకోవడంలో నడ్డా విజయం సాధించాల్సి ఉంటుంది.
అమిత్ షా అభినందనలు
బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగత్ ప్రకాశ్ నడ్డాను మాజీ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. నడ్డా నాయకత్వంలో బీజేపీ పార్టీ మరిన్ని శిఖరాలను అధిరోహిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీని నడ్డా మరింత విస్తరించటంతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెస్తారని అమిత్ షా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనం, నడ్డా పటిష్టమైన నాయకత్వంలో పార్టీ మరింత విస్తరిస్తుందని అమిత్ షా చెప్పారు. 5 సంవత్సరాల పాటు బీజేపీ అధ్యక్షునిగా పని చేసినందుకు గర్విస్తున్నానని ఆయన అన్నారు.
'చిత్రం...బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జేపీ నడ్డాను అభినందిస్తున్న ప్రధాని మోదీ. సీనియర్ నాయకుడు
ఎల్‌కే అద్వానీ, హోం మంత్రి అమిత్ షా