జాతీయ వార్తలు

ఎన్‌పీఆర్‌పై అదే మాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనరి 20: జాతీయ జనాభా నమోదు(ఎన్‌పీఆర్) సవరణ విషయంలో కేంద్రానికి సహకరించేది లేదని కేరళలోని వామపక్ష ఫ్రంట్ కూటమి ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్‌పీఏలో మార్పులు, చేర్పులకు సహకరించబోం’అని కేబినెట్ స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి కేరళ సర్కార్ తేల్చిచెప్పింది. జనగణన రిజిస్ట్రార్ జనరల్, కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈరెండు కూడా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఎన్‌పీఆర్ అప్‌డేషన్‌కు అంగీకరించేది లేదని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తెలిపింది. ప్రజల బాగోగులు చూసుకోడం రాజ్యాంగం తమకు కల్పించిన బాధ్యతగా కేబినెట్ పేర్కొంది. ‘ప్రజల్లో నెలకొన్న భయాలు తొలగించాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం మాపై పెట్టింది’అని సీఎంవో విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రక్రియకు సంపూర్ణ మద్దతును ఇస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.
పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రంలోని ఎన్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఏఏ అలాగే ఎన్‌ఆర్‌సీ విషయంలోనూ వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంతో విభేదించింది. ఎన్‌పీఏ అప్‌డేషన్ విషయంలో కేంద్రానికి సహకరించకూడదని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలిపివేసింది. ‘ఎన్‌ఆర్‌సీని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎన్‌పీఏలో మార్పులు తలపెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో ఒక రకపైన అభద్రతాభావం నెలకొంది. దాన్ని తొలగించాల్సిన అవసరం మాపై ఉంది’అని సీఎంవో వెల్లడించింది. ఎన్‌ఆర్‌సీ వల్ల అస్సాం మండిపోతోందన్న విజయన్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌పీఏ తెస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని మంత్రివర్గం పేర్కొంది. ఇలా ఉండగా కేరళ ప్రభుత్వం ఎన్‌పీఏ అప్‌డేషన్‌కు సంబంధించి ప్రక్రియను నిలిపివేసింది.
ఒక వేళ బలవంతంగా అమలుచేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసుశాఖ నివేదించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్‌పీఏ అప్‌డేషన్ వల్ల జనాభాలెక్కల కార్యక్రమంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం గత నెల 29న అన్ని పార్టీలు, పౌర సమితులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్‌పీఆర్‌పై చర్చించింది. సీఏఏ విషయంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో అమలుచేసేది లేదని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే సీఏఏను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది.