జాతీయ వార్తలు

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా/సిలిగురి: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)ను నిర్వహించే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆమె సూచించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ రాష్ట్ర అసెంబ్లీలోనూ త్వరలో తీర్మానం చేయనున్నట్లు ఆమె తెలిపారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) చాలా ప్రమాదకరమైన ఆటగా ఆమె అభివర్ణించారు. దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆమె సూచించారు. ఎన్‌పీఆర్‌లోని కొన్ని క్లాజులను తొలగించాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తాము ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా తీర్మానం చేశామని ఆమె చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లో తాము పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తామని ఆమె తెలిపారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించాయని ఆమె గుర్తు చేశారు. ఎన్‌పీఆర్ అనేది జనాభా లెక్కల సేకరణ వంటిదేనని తాను తొలుత భావించానని చెప్పారు. అయితే ఎన్‌పీఆర్‌లోని క్లాజులను చూస్తే ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీంతో తేరుకున్నానని, వారు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన (బీజేపీ పాలితతో సహా) ముఖ్యమంత్రులు ఎన్‌పీఆర్‌ను చేపట్టడానికి ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మమతా బెనర్జీ సూచించారు. తాను ప్రజల సంరక్షకురాలినని, ఎన్‌పీఆర్‌కు సంబంధించి కేంద్రం చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు.

'చిత్రం...తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ