జాతీయ వార్తలు

వివరాలు అత్యంత గోప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: జాతీయ పౌరసత్వ రిజిస్ట్రీ (ఎన్‌పీఆర్) సందర్భంగా ప్రజలు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని రిస్ట్రార్ జనరల్ అండ్ సెనె్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, భయాందోళనలు చెందవద్దని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గతంలో జరిగిన జనాభా సేకరణకు భిన్నంగా, కొన్ని కొత్తకొత్త చేర్పులతో 2021 జన గణన జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకూ ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి, సమాచారాన్ని సేకరిస్తారు. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో హిమ పాతాన్ని దృష్టిలో ఉంచుకొని, అక్కడ జనగణన అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ కొనసాగించనున్నారు. కాగా, కొత్త యాప్‌ను కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఎన్‌పీఆర్‌లో పొందుపరచిన అనేక అంశాలు లేదా కోరుతున్న సమాచారం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. వ్యక్తిగత భద్రత, స్వేచ్ఛకు భంగం కలిగించేలా సమాచారానాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతున్నదని ధ్వజమెత్తుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తోపాటు ఎన్‌పీఆర్‌ను కూడా అనుమతిచేది లేదని కేరళ, పంజాబ్ అసెంబ్లీలు తీర్మానాలను ఆమోదించాయి. గత వారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌పీఆర్ విధివిధానాలను చర్చించేందుకు జరిగిన సమావేశంలో బీజేపీయేతర రాష్ట్రాల ప్రతినిధులు పలు అభ్యంతరాలను లేవనెత్తారు. వీటిపై హోం శాఖ స్పందిస్తూ, కొన్ని వివరాలను ఇవ్వడం ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, తప్పనిసరి కాదని తెలిపింది. రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీ డీబీ గుప్తా ఎన్‌పీఆర్ ఆచరణయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘ఉదాహరణకు ఎన్‌పీఆర్‌లో వివరాలు ఇచ్చే వ్యక్తులు తమతమ తల్లిదండ్రుల జన్మ స్థలాల వివరాలను పేర్కోవాలి. ఇది సాధ్యమా. దేశంలో చాలా మందికి తమతమ తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారనే విషయం తెలిసి ఉండదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందికి పాన్ కార్డు, ఓటర్ ఐడీ ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డు లేని వారు లేదా వాటిలో పొరపాటు సమాచారం ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. వారంతా ఏ విధంగా వివరాలను ఇస్తారు? ఇది సాధ్యమా? ఆచరణ యోగ్యమా?’ అని నిలదీశారు. అయితే, ఆర్‌జీఐ తన ప్రకటనలో ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలు 1948 జనాభా లెక్కల సేకరణ చట్టం కింద అత్యంత గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా, ఎలాంటి సమాచారాన్నయినా బహిర్గతం చేస్తే, అలాంటి వారిపై చట్టప్రకారం చర్య తీసుకునే అవకాశం ఉందన్నారు. 1955, ఆతర్వాత 2003లో జనాభా లెక్కల సేకరణ చట్టానికి మార్పులుచేర్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా, అత్యాధునిక టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్ ద్వారా తమతమ సమాచారాన్ని పంపించే అవకాశం కూడా ఉందన్నారు. పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం ఆయా వ్యక్తుల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని ఆర్‌జీఐ తేల్చిచెప్పారు. అన్ని వివరాలు గోప్యంగా ఉంటాని పునరుద్ఘాటించారు.