జాతీయ వార్తలు

మతం ఆధారంగా పౌర చట్టమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తొమ్మిది అసత్యాలు చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ఆరోపించారు. మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టంలో ఎలాంటి విచక్షణ లేదని చెప్పడం మొదటి అసత్యమని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పుట్టినా, తల్లిదండ్రులు ఇక్కడే పుట్టినా, పదకొండేళ్లపాటు ఇక్కడ నివసించినా, పేరు రిజిష్టర్ చేసుకున్నా లేక ప్రాంతాల విలీనం జరిగినా భారతీయ పౌరసత్వం లభిస్తుందని, కానీ ఈ ఐదు పద్ధతుల్లో మతంతో ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబల్ వివరించారు. దేశం చరిత్రలో మొదటిసారి పౌరసత్వ సవరణ చట్టం మూలంగా మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏకు ఎన్‌ఆర్‌సీతో ఎలాంటి సంబంధం లేదని మోదీ, అమిత్ షా చెప్పడం రెండో అసత్యమని ఆయన అన్నారు. సీఏఏ తరువాత ఎన్‌ఆర్‌సీ వస్తుందని మోదీ, అమిత్ షా స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌సీ గురించి ప్రభుత్వంలో ఎక్కడా చర్చ జరగలేదని మోదీ చెప్పడం మూడో అసత్యమన్నారు. రాష్టప్రతి ప్రసంగంలో ఎన్‌ఆర్‌సీ వస్తుందని చెప్పించారని, అదేవిధంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని అమిత్ షా రాజ్యసభలో చెప్పారని ఈ సందర్భంగా కపిల్ సిబల్ గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌సీ నోటిఫై కాలేదనడం నాలుగో అసత్యం. 2003లో ఎన్‌ఆర్‌సీని చేపట్టినప్పుడు క్లాజ్ 14 (ఏ) ప్రకారం ఎన్‌పీఆర్ ప్రస్తావన ఉందన్నారు. జాతీయ గుర్తింపు కార్డు ఇస్తామని 2003 చట్టంలో పెట్టి నోటిఫై చేశారు కదా? అంటూ ఎన్‌ఆర్‌సీ ఇంకా ప్రారంభం కాలేదనడం ఐదో అసత్యమన్నారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను 2020 ఏప్రిల్ 1 ఒకటి నుండి ప్రారంభిస్తామని అప్పటి హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 2019 జూలైలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. ఎన్‌పీఆర్‌కు ఎన్‌ఆర్‌సీతో సంబంధం లేదనడం ఆరో అసత్యమని ఆయన అన్నారు. 2018-19 హోం శాఖ వార్షిక నివేదికలో ఎన్‌ఆర్‌సీ ఏర్పాటుకు ఎన్‌పీఆర్ మొదటి మెట్టు అని ప్రకటించడం నరేంద్ర మోదీ, అమిత్ షా మరిచిపోయారా? అని ఆయన నిలదీశారు. ఏ భారతీయుడు కూడా భయపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదనడం ఏడో అసత్యమన్నారు. భారత మాజీ రాష్టప్రతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు అస్సాం జనాభా జాబితా నుండి మాయమైపోయాయని చెప్పారు. అలాగే, డిటెన్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటూ నరేంద్ర మోదీ ప్రకటించటం ఎనిమిదో అసత్యమని ఆయన తెలిపారు. అస్సాం, కర్నాటకలో డిటెన్షన్ కేంద్రాలున్నాయని ఆయన తెలిపారు. డిటెన్షన్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు ఎప్పుడో జారీ అయ్యాయని ఆయన చెప్పారు. సీఏఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై బలప్రయోగం జరగలేదనడం తొమ్మిదో తప్పు అంటూ ఇంతవరకు 18 మంది ఎలా మరణించారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శరణార్థులకు శరణు ఇచ్చిన భారతదేశం పట్ల తనకు గర్వంగా ఉన్నదంటూ స్వామివివేకానంద చేసిన ప్రకటనను ఆయన ఉటంకిస్తూ వివేకం లేనివారితో ఏం వాదిస్తామంటూ నరేంద్ర మోదీ, అమిత్ షాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి తనతో వాదించేందుకు నరేంద్ర మోదీని ఆయన సవాల్ చేశారు. మోదీ, అమిత్ షా మూలంగా దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. దేశంలోని యువత నిరుద్యోగాన్ని ఎదుర్కొంటుంటే మోదీ, అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.