జాతీయ వార్తలు

సీఏఏపై ప్రతిపక్షాల ‘దుశ్శాసన’ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తూ.. ‘్ధనసహాయం’ చేస్తూ గృహదహనాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ సీఏఏపై జరిగిన అవగాహన ర్యాలీలో సీఎం ప్రసంగించారు. ఈ ర్యాలీలో హోం మంత్రి అమిత్‌షా సైతం పాల్గొన్నారు. సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాభారతంలో ‘దుశ్శాసనుడి’ పాత్రను ప్రతిపక్షాలు పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్ష, హింసకు గురౌతూ నానా అవస్థలు పడుతున్న వారికి భారత పౌరసత్వం కల్పించే ధైర్యం చేయలేకపోయాయని విమర్శించారు. పైగా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు నానా తంటాలు పడుతున్నాయని యోగి వ్యాఖ్యానించారు. సీఏఏపై ప్రజలను గందరగోళంలో పడవేస్తున్నప్పటికీ వారు మాత్రం ప్రధానమంత్రి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మహాభారతంలో ‘దుశ్శాసనుడి’లా వ్యవరిస్తున్నాయనీ.. వారి చర్యలు చూస్తూ వౌనంగా ఉండే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. పౌరసత్వ చట్టాన్ని తేవడంలో ప్రధాని మోదీ ఎంతో సాహసం ప్రదర్శించారని కొనియాడారు. ‘పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నా.. గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తెచ్చే సాహసం చేయలేకపోయాయి.. ఇప్పుడు కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళంలో పడేయాలని చూస్తున్నాయి.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి వాస్తవ పరిస్థితులను వివరించాలన్నదే ఎన్డీయే ప్రభుత్వ యోచన’ అని సీఎం ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

'చిత్రం... సీఎం యోగి ఆదిత్యనాథ్