జాతీయ వార్తలు

గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పూర్వ వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం దాదాపు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తదితరులున్నారు. పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జోత్‌సింగ్ సిద్ధుతో పాటు వెటరన్ నటుడు, రాజకీయ నాయుకుడైన శత్రుఘ్నసిన్హా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. గతంలో బీజేపీలో ఉన్న వీరిద్దరూ ఢిల్లీలో ఉన్న పంజాబీ, పూర్వాంచలి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రచారంలోకి వస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో ఆర్‌జేడీ పోటీ చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుండగా 11వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ పట్టుసాధించి అధికార పగ్గాలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దూకుడుగా ప్రచారం చేపట్టింది. పూర్వ వైభవం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్.. అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారంలోకి దింపుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామిలను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేపట్టనున్నారు. అలాగే, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్‌చోప్రా, ప్రచార కమిటీ అధ్యక్షుడు కీర్తి ఆజాద్, ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌చార్జి పీసీ చాకో, ఎన్‌ఎస్‌యుఐ చీఫ్ నీరజ్ కుందన్ తదితరులు కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు.
'చిత్రం... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా