జాతీయ వార్తలు

ప్రజాస్వామిక సూచీతో భారత్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రజాస్వామ్య, ప్రజా హక్కుల పరిరక్షణలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠను కోల్పోతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రజాస్వామిక సూచీలో భారత్ 10 స్థానాలను కోల్పోయి 51వ స్థానానికి చేరింది. 165 దేశాలకు సంబంధించి విడుదలైన ఈ తాజా సూచీలో భారతదేశం ప్రజాస్వామిక విలువలను పెద్దగా పాటించడం లేదని స్పష్టమైంది. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2006లో మొట్టమొదటిసారిగా డెమొక్రసీ ఇండెక్స్‌ను విడుదల చేశారు. అప్పటినుంచి ప్రతి యేటా ఈ సూచీల విడుదల క్రమం తప్పకుండా విడుదలవుతోంది. మొత్తం 10 పాయింట్లకుగాను భారత్ 2017, 2018 సంవత్సరాల్లో 7.23, 2016లో 7.81 చొప్పున పాయింట్లను సంపాదించింది. 2014లో అత్యధికంగా 7.91 పాయింట్లు లభించాయి. అయితే, గత ఏడాది కేవలం 6.9 పాయింట్లతో భారత్ సరిపుచ్చుకుంది. ఫలితంగా ఏకంగా 10 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు కూడా సూచీల పాయింట్లను నిర్ధారించడానికి ప్రామాణికంగా తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మొబైల్ నెట్‌వర్క్ సేవల నిలిపివేతపై ఇటీవల సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ పరిస్థితులన్నీ భావ ప్రకటనకు అడ్డంకులుగా ఉన్నాయని డెమొక్రసీ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. నెలల తరబడి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు అత్యంత దారుణమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. ఇలావుంటే, ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో ఉండగా, టాప్-5లో దీంతోపాటు ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ చోటు సంపాదించాయి. ఉత్తర కొరియా చిట్టచివరి స్థానంలో ఉంది.
పాకిస్తాన్ 4.25 పాయింట్లతో 108వ స్థానం, చైనా 2.26 పాయింట్లతో 153 స్థానాల్లో ఉన్నాయి.