జాతీయ వార్తలు

క్లాస్ రూం నిధులు పక్కదారి పట్టాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తరగతి గదుల నిర్మాణం, కాలుష్య నివారణ మాస్క్‌లు కొనుగోలులో ఆప్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని బుధవారం ఇక్కడ ధ్వజమెత్తారు. తాను చేసిన ఆ ఆరోపణలకు కేజ్రీవాల్ సర్కార్ సమాధానం చెప్పాలని థరూర్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేజ్రీవాల్ పుణ్యమాని ఢిల్లీ అత్యాచారాల రాజధానిగా మారిపోయిందని మరో కాంగ్రెస్ నేత షర్మిష్ఠా ముఖర్జీ ఆరోపించారు. ఇద్దరి నేతల వల్లే రాజధానిలో శాంతి భద్రతలు మృగ్యమయ్యాయని ఆమె విమర్శించారు. ‘అవినీతిపై పోరాడుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటోంది. అయితే నేను చేసిన ఆరోపణలకు కేజ్రీవాల్ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?. ఆ డబ్బులన్నీ ఎక్కడి వెళ్లాయి?’అని థరూర్ నిలదీశారు. ఆప్ ప్రభుత్వం 2,892 కోట్ల రూపాయలతో 12,782 తరగతి గదులు నిర్మించిందని ఆయన చెప్పారు. అందులో నిజంగా తరగతి గదులుకు ఖర్చుచేసిందెంత?అని ఆయన ట్వీట్ చేశారు. ‘మా దగ్గరున్న అంచనా ప్రకారం క్లాస్ రూమ్‌ల నిర్మాణాలకు మహా అయితే 800 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ లెక్కన మిగిలిన రెండు వేల కోట్ల రూపాయలు ఏమైనట్టు?’అని థరూర్ ప్రశ్నించారు. ఈ సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ట్వీట్‌లో ప్రశ్నలు సంధించడంతోపాటు ఏకంగా ఓ వీడియోను థరూర్ పోస్టు చేశా రు. అలాగే పాఠశాల విద్యార్థులకు మాస్క్‌లు కొనుగోలులోనూ అవకతవకలు చోటుచేసుకున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాధనాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లకు మంచినీళ్లలా ఖర్చుచేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్లలో ఆప్ ప్రభుత్వం కొత్త ఆసుప్రతి ఒక్కటైనా ప్రారంభించిందా?అని ఆయన ప్రశ్నించారు. వెయ్యి మహో ల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభు త్వం కేవలం 189 ప్రారంభించారని శశి థరూర్ విమర్శించారు. అందు లో వంద కేంద్రాలు పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నీటి సరఫరా దారుణంగా ఉందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని షర్మిష్ఠా ముఖర్జీ ఆరోపించారు.