జాతీయ వార్తలు

ప్రజలకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 22: గతంలో ఎన్నడూ లేనివిధంగా జమ్మూకాశ్మీర్ ప్రజలకు అన్నివిధాలా భరో సా కల్పిస్తున్నామని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. శ్రీనగర్‌లో పలువురు కేంద్ర మంత్రులు బుధవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులతో కలసి ముచ్చటించిన నఖ్వీ ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ అన్నివిధాలా అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఈ సానుకూల ధోరణులు వ్యక్తిగత, సామాజిక మార్పులకు అత్యవసరమని అన్నారు. ప్రజల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగిందని, ఇప్పుడు మరింతగా స్వేచ్ఛగా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని ఆయన అన్నారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద ఆయన మార్కెట్‌లో పర్యటించారు. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జీసీ ముర్ముకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఫరూఖ్ ఖాన్, ఇతర అధికారులు ఉన్నారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.

'చిత్రం... కేంద్ర మంత్రి నఖ్వీ