జాతీయ వార్తలు

నటనే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే, జనవరి 22: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేసి నిర్బంధ సెలవుపై ఉన్న ముంబయి వర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీ యోగేష్ సోమన్ రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నటన నా ప్రాణం. నా ఊపిరి’ అని ఆయన స్పష్టం చేశారు. నటన, నాటక రంగంపై మాట్లాడమని ఎవరు పిలిచినా వెళ్తానని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సోమన్ ప్రకటించారు. నటనంటే తనకు ప్రాణమని సోమన్ చెప్పారు. అధికారం, రాజకీయాలు, బోధన వేర్వేరు రంగాలని వాటిని కలగలిపి చూడవద్దని ఆయన సూచించారు. ముంబయి యూనివర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ సోమన్‌ను గతవారమే నిర్బంధ సెలవుపై పంపేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ వీడియోను సోమన్ పోస్టు చేశారు. దీంతో యాజమాన్యం ఆయనపై కనె్నర్ర చేసింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. ‘నేను రాహుల్ గాంధీని.. రాహుల్ సావర్కన్ కాదు’అని కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాన్ని విమర్శిస్తూ సోమన్ ఓ వీడియో పోస్టు చేశారు. శివసేన కార్మిక, చలన చిత్ర విభాగం ఏర్పాటు చేసిన ఓ వర్క్‌షాప్‌లో సోమన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువత, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతాయని అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతి సందర్భంగా ఈ వర్క్‌షాప్ ఏర్పాటైంది. ‘స్క్రీన్‌ప్లే, నటన, దర్శకత్వంపై వర్క్‌షాప్ ఏర్పాటైంది. అధ్యాపకునికి ఈ రంగంలో నేను నిష్ణాతుడినే. అందుకే నన్ను నిర్వాహకులు పిలిచ్చారు. నా అనుభవాలు విద్యార్థులు, యువతకు పంచుతాను’అని ఆయన అన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు ఏ పార్టీలు ఏర్పాటు చేసినా మంచిదే అని సోమన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ లేదా బీజేపీ తనను ఆహ్వానిస్తే వెళ్తానని ఆయన ప్రకటించారు. నాటకరంగంపై మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సోమన్ అన్నారు. కళకు సరిహద్దులుండవని, ఉపాధ్యాయులు, శిక్షకులు అందుకు మినహాయింపుకాదని డైరక్టర్ చెప్పారు. రాహుల్‌ను విమర్శించానన్న కారణంతోనే తనపై ప్రభుత్వం వత్తిడి చేసి సెలవుపై పంపిందన్న సోమన్ ‘దానిపై నేను వ్యక్తిగతంగా పోరాడతా’అని ప్రకటించారు. అలాగే రాజకీయాలు, అధికారం, బోధనను కలిపి చూడకూడదని చెప్పారు.