జాతీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీకి 1,528 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి వచ్చేనెల 8న జరిగే ఎన్నికలకు సంబంధించి 1528 నామినేషన్లు దాఖలయ్యాయని ఈసీ వెల్లడించింది. 1029 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 1029 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, అందులో మహిళలు 187 మంది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం. ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దించింది.
1000 ‘కోడ్’ ఉల్లంఘనలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 1000 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, వాటిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపారు. ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ అధికారి రణ్‌బీర్ సింగ్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2,078 వాహనాలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అందులో ఆటోరిక్షాలు, ఈ- రిక్షాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు సింగ్ స్పష్టం చేశారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన 543512 హోర్డింగ్‌లు, పోస్టర్లను తొలగించినట్టు సీఈవో వెల్లడించారు. సంబంధిత సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగుతాయి. 11న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో జనవరి 6 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.