జాతీయ వార్తలు

బీజేపీలో విలీనం చేయం.. సమన్వయంతో నడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: బీజేపీలో జనసేన విలీనం అవుతుందా? అని ప్రశ్నించిన ఒక విలేకరిపై జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం బీజేపీ రాజ్యసన సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ-జనసేన కూటమి విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రెండు పార్టీలు సమన్వయంతో పని చేస్తాయి అని చెప్పారు. రెండు పార్టీలు కూటమిగా పని చేస్తాయని అంటున్నారు, అంటే బీజేపీలో జనసేన విలీనమయ్యే అవకాశాలున్నాయా? అని ఒక విలేకరి ప్రశ్నించగా మీరు మాట, మాటకు విలీనం గురించి ఆడుగుతున్నారు, మామూలుగా అడుగుతున్నారా? లేక కావాలని అడుగుతున్నారా? అని పవన్ కల్యాణ్ ఆగ్రహంగా అన్నారు. మీకు మరోసారి స్పష్టం చేస్తున్నాను, బీజేపీ, జనసేన ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక కూటమిగా పని చేస్తాయే తప్ప విలీనం కావడం లేదని ఆయన ఆవేశంతో చెప్పారు. తమ వద్ద విలీనం అనే ఆలోచనే లేదు, మీరు మాట మాటకు విలీనం, విలీనం అంటూ అయోమయం సృష్టించవద్దని ఆయన స్పష్టం చేశారు.

'చిత్రం... జనసేన అధినేత పవన్ కల్యాణ్