జాతీయ వార్తలు

కేంద్ర జోక్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నూతన అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తనతో చెప్పారని వివరించారు. పవన్ గురువారం నడ్డాను కలిసి, బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతేగాక, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుపై ఆయన నడ్డాతో చర్చించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా అనుమతితోనే రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని జగన్ పదేపదే చెప్పడాన్ని నడ్డా దృష్టికి తీసుకెళ్లగా, ఆ నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారని పవన్ తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు గురించి ప్రధానితో చర్చించానంటూ జగన్ చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని పవన్ తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం భూదందాల కోసమే మూడు
రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తున్నదే తప్ప, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ తన ప్రయోజనాల కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు నరేంద్ర మోదీ, అమిత్ షా మద్దతు ఉన్నదంటూ తప్పుడు మాటలు చెబుతున్నారని పవన్ ఆరోపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఫిబ్రవరి రెండో తేదీన బీజేపీ శ్రేణులతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. నడ్డాతో చర్చలు బాగా జరిగాయి, అన్ని అంశాలపై ఆయనతో మాట్లాడానని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి నడ్డాకు వివరించినట్టు ఆయన తెలిపారు.

'చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్