జాతీయ వార్తలు

రాష్ట్రాలు అడ్డుకోలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినా అమలు చేయకుండా ఉండలేవు, అయితే ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అమలులో కీలక పాత్ర నిర్వహించవచ్చునని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ స్పష్టం చేశారు. శశిథరూర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపలేవు’అని తేల్చిచెప్పారు. ఇటీవల మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలువరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత మాత్రం లేదని కుండబద్దల కొట్టినట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు శశిథరూర్ కూడా సిఏఏ విషయంలో ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేయటం గమనార్హం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం సిఏఏను వ్యతిరేకించవచ్చు, ఏమైన చేయవచ్చు కానీ అమలును నిలిపివేయలేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయవచ్చు, సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు కానీ అమలు విషయంలో ఏమీ చేయలేవన్నారు. పౌరసత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు చేయవసిందేదీ లేదన్నారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీని అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కాబట్టి ఈ రెండింటి అమలు విషయంలోకీలక పాత్ర నిర్వహించవచ్చునని థరూర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించని పక్షంలో ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అమలు చేయటం చాలా కష్టమని కాంగ్రెస్ ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని అభ్యంతరాలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వం, వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ సీఏఏకు వ్యతిరేకంగా తమ తమ శాసన సభల్లో తీర్మానాలు చేసిన సంగతి తెలసిందే. కేరళ ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టులో సిఏఏకు వ్యతిరేకంగా పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు మాత్రం ఇలాంటిదేదీ చేయలేదు. ఇదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనునిత్యం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయటంతోపాటు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే తప్ప ఇంత వరకు సిఏఏకు వ్యతిరేకంగా శాసన సభలో తీర్మానం చేయటం లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేకపోవటం గమనార్హం. ఇలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సిద్ధపడడాన్ని థరూర్ స్వాగతించారు. పౌరసత్వ సవరణ చట్టం మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తోంది, ఈ అంశాన్ని ఐదుగు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించటం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చునని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ‘సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కొట్టివేయవచ్చు లేదా ప్రభుత్వం తనంత తాను ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలున్నది. ఇతరత్రా ఈ గొడవకు ఎలాంటి పరిష్కారం లేదు’అని ఆయన పేర్కొన్నారు.
పుట్టిన ప్రాంతం, పౌరసత్వానికి సంబంధించిన ప్రశ్నలను సిఏఏ నుంచి తొలగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్‌ఆర్‌సీని తయారు చేసే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని శశిథరూర్ స్పష్టం చేశారు. సిఏఏను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి కట్టుగా పని చేయాలి తప్ప ఎవరికి వారు తమ దారిలో పని చేసుకుపోతే కేంద్ర ప్రభుత్వం ఎంత మాత్రం దిగిరాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అంటే కేవలం గాంధీ కుటుంబం కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.
'చిత్రం... కాంగ్రెస్ నేత శశిథరూర్