జాతీయ వార్తలు

‘హిందూ’ రాజకీయాలతో విభేదించిన నేతాజీ బోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ లౌకికవాదం, దేశ ఐక్యత కోసం పోరాడారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే హిందూ మహాసభ ‘విభజన రాజకీయాల’తో నేతాజీ విభేదించేవారని గురువారం ఇక్కడ చెప్పారు. భారత దేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు కావాలని ఆమె అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయుడు బోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మమత డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన నేతాజీ బాటలో నడవాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ఐక్యత కోసం పోరాడిన బోస్ సందేశాలను గౌరవించడమే నిజమైన నివాళిగా తృణమూల్ అధినేత్రి పేర్కొన్నారు. ‘నేతాజీ నిజమైన నాయకుడు. లౌకిక వాదం కోసం పాటుపడ్డారు’అని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. 1940లోనే హిందూమహాసభ విభజన రాజకీయాలను నేతాజీ వ్యతిరేకించారని ఆమె గుర్తుచేశారు. హిందూమహాసభ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆనాతే బోస్ విభేదించారని మమత చెప్పారు. దేశంలో లౌకిక వాదం కోసం చివరి వరకూ పోరాడిన ధీశాలి నేతాజీ అని నివాళి అర్పించారు. నేజాతీ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నేతాజీ అదృశ్యం మిస్టరీ చేధించాలన్న శ్రద్ధ కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు. అందుబాటులో ఉన్న ఏవో కొన్ని ఫైళ్లను బహిర్గతం చేయడమే తప్ప వాస్తవం ఏమిటో తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేయడం లేదని ఆమె ధ్వజమెత్తారు. 70 ఏళ్లయినా నేతాజీ అదృశ్యంపై నిజాలు తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటని మమతా బెనర్జీ తెలిపారు. ప్రణాళిక సంఘం రూపకర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని 2014లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక రద్దుచేసిందని ఆమె విమర్శించారు.
ప్రణాళిక సంఘం పేరుతో నీతి ఆయోగ్ తీసుకొచ్చారని ఆమె విరుచుకుపడ్డారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగ ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
'చిత్రం... పశ్చిమ బెంగాల్ సీఎం మమత