జాతీయ వార్తలు

ఈ దశాబ్దం మనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకునే విషయంలో రాజ్యాంగ పద్ధతులను ఎంత మాత్రం విడనాడకూడదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్ధేశించి మాట్లాడిన ఆయన అహింసాయుత మార్గాలను ఎంత మాత్రం విస్మరించకూడదని తెలిపారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. ఏ లక్ష్యమైనా అహింసాయుత పద్ధతుల్లోనే సాధించుకోవాలని యువతకు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యావత్ మానవాళికి అందించిన అహింసా మంత్రాన్ని ప్రస్తావించిన రాష్ట్రపతి మంచి చెడులను నిర్ణయించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంతగానో పని చేస్తుందని తెలిపారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ అన్నది ఆధునిక భారతంలో మూడు కీలక స్తంభాలని, ఈ మూడు కూడా పరస్పర ఆధారితమైనవేనని ఆయన అన్నారు. అయితే ‘మేము భారత ప్రజలం అన్న వౌలిక భావనను ఎంత మాత్రం విస్మరించకూడదని, సమాఖ్య వ్యవస్థలో ప్రజలే కీలకమని అన్నారు. దేశ భవితవ్యాన్ని నిర్ణయించే నిజమైన శక్తి ప్రజలకే ఉందన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల బాధ్యతల నుంచి కూడా ఆయన మాట్లాడారు. తమ రాజకీయ ఆలోచనల మాట ఎలా ఉన్నా, అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఈ రెండు కూడా కలిసి పని చేయాలని ఉద్ఘాటించారు. జాతి నిర్మాణంలో గాంధీజీ ఆశయాలు ఇప్పటికీ ఆనుసరణీయమని, ఇవి ప్రతి ఒక్కరి దైనందిన జీవతంలో భాగం కావాలని అన్నారు. సత్పవర్తన, అహింసా అన్నది నేటి పరిస్థితుల్లో మరింత అనివార్యంగా మారాయని రాష్టప్రతి తెలిపారు. రాజ్యాంగం అన్నది పౌరులకు హక్కులు కల్పించినప్పటికీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలన్న బాధ్యత కూడా అందించిందని రాష్ట్రపతి అన్నారు. ప్రస్తుత సాంకేతిక ప్రగతిలో యువత ఎంతో ధీమాగా చైతన్యంగా సాగుతున్నదని ఆయన తెలిపారు. తర్వాతి తరం కూడా భారత దేశ మూల విలువలకు బలంగా కట్టుబడి ఉంటుందని తెలిపారు. యువతతోనే నవ భారత నిర్మాణ ఆశయం సిద్ధిస్తుందని అన్నారు. దేశాభివృద్ధికి బలమైన అంతర్గత భద్రత ఎంతో అవసరమని రాష్టప్రతి ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సేవలను రాష్టప్రతి శ్లాఘించారు. గగన్‌యాన్ మిషన్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నామని అన్నారు. స్వచ్చ్భారత్ సహ ప్రభు త్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రాచీన కాలం నుంచి కూడా ఓ బలమైన విద్యా కేంద్రంగా భారత్ రాణిస్తూ వచ్చిందని, నలంద, తక్షశిల వంటి కేంద్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారం, ఖ్యాతి సంపద కంటే కూడా భారత దేశం విద్యకే ఎంతో విలువనిచ్చిందన్నారు.

'చిత్రం...రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్