జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు ఐదు పద్మాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన మొత్తం 141 పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులో రెండు తెలు గు రాష్ట్రాలు కేవలం ఐదు అవార్డులు మాత్రమే సాధించి మిగతా రాష్ట్రాల కంటే వెనకపడిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు లభించిన ఒక పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులలో మూడు తెలంగాణాకు, రెండు ఆంధ్ర ప్రదేశ్‌కు లభించాయి. తెలంగాణ నుంచి ప్రముఖ బ్యాడ్‌మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు లభించగా చింతల వెంకటరెడ్డి, విజయసారథి శ్రీ్భష్యంలకు పద్మశ్రీ అవార్డులు
లభించాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన దలవాయి చలపతరావు, ఎడ్ల గోపాలరావుకు పద్మశ్రీ అవార్డు లభించాయి. పద్మ అవార్డుల సాధనలో కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడినట్లు కనిపించాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా గణనీయమైన సంఖ్యలో అవార్డులు లభించాయి. మొత్తం మీద చూస్తే సృజనాత్మకత, కళలు, సాహాత్యం, సమాజ సేవ, వైద్యం తదితర రంగాల్లో నిష్ణాతత సాధించటంలో రెండు తెలుగు రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నట్లు పద్మ అవార్డులు సూచిస్తున్నాయి.
'చిత్రం... ప్రముఖ బ్యాడ్‌మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు