జాతీయ వార్తలు

ఎన్‌డీఎఫ్‌బీతో ఒప్పందానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం, అస్సాంలోని నిషిద్ధ తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదరడానికి రంగం సిద్ధమయింది. అయితే, ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్న ఎన్‌డీఎఫ్‌బీ కీలక డిమాండ్‌కు ఈ ఒప్పందంలో చోటు దక్కడం లేదు. కాని, ఈ ఒప్పందం వల్ల బోడోల్యాండ్ ప్రాంతానికి రాజకీయంగా, ఆర్థికంగా ఆకస్మిక లబ్ధి మెండుగా సిద్ధించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఎన్‌డీఎఫ్‌బీలోని నాలుగు వర్గాల ఉన్నత స్థాయి నాయకులు, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరి సత్యేంద్ర గార్గ్, అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ సంజయ్ కృష్ణ సంతకం చేయనున్నారు. ‘ఈ ఒప్పందం అస్సాంలో జీవిస్తున్న బోడో గిరిజనులకు కొన్ని రాజకీయ హక్కులను, ఆర్థిక ప్యాకేజీని ప్రసాదిస్తుంది’ అని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. అస్సాం ప్రాదేశిక సమగ్రత కొనసాగుతుందని, బోడోల్యాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న ఎన్‌డీఎఫ్‌బీ కీలక డిమాండ్‌కు ఈ ఒప్పందంలో చోటు దక్కబోవడం లేదని ఆ అధికారి వివరించారు. ‘రాష్ట్రాన్ని విభజించకుండా రాజ్యాంగం పరిధిలో ఈ ఒప్పందం ఉంటుంది’ అని మరో అధికారి వెల్లడించారు. అస్సాంలో బోడోల తిరుగుబాటుకు స్వస్తి పలికేందుకు వీలయినంత త్వరగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా భావిస్తున్నారని ఆ అధికారి తెలిపారు.