జాతీయ వార్తలు

రాజ్‌పథంలో నేడు ప్రగతి రథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత సైనిక పాటవం, సాంస్కృతిక వైభవం, సామాజిక, ఆర్థిక ప్రగతికి జయకేతనంగా 71వ గణతంత్ర దినోత్సవం ఆదివారం రాజ్‌పథ్‌లో ఆవిష్కృతం కానుంది. బ్రెజిల్ అధ్యక్షుడు జాయెద్ బోల్సోనారో ముఖ్య అతిధిగా ఈ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటున్నారు. దాదాపు 90 నిమిషాలపాటు భిన్నరీతుల్లో భారతీయ మహోత్సవంగానే గణతంత్ర సంబరాలు జరుగనున్నాయి. ఉపగ్రహ నిరోధక ఆయుధం, శక్తి, సైనిక దళాల యుద్ధ ట్యాంకు భీష్మతోపాటు అనేక యుద్ధ వాహనాలు, కొత్తగా సైన్యంలో చేరిన చినూక్ అపాచీ హెలికాప్టర్లు తమ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేశ రాజధాని నగరంలో రెప్పవాల్చని నిఘా ఏర్పాటు చేశారు. భూతలం నుంచి గగనతలం వరకు ఎక్కడా ఏ లోపానికీ ఆస్కారం లేకుండా వేలాది మంది పోలీసులు, పారా మిలటరీ దళాలు భద్రతా విధులను నిర్వహిస్తున్నాయి. ఈ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శితమవుతున్న వివిధ శకటాలు దేశ సాంస్కృతిక వారసత్వానికి, ఆర్థిక పురోగతికి అద్దం పట్టబోతున్నాయి. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సంస్కృతి, ప్రగతికి దర్పణంగా వివిధ ఆకృతుల్లో ఈ శకటాలను రూపొందించాయి. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు కూడా మరో ఆరు శకటాలను ప్రదర్శించనున్నాయి. ఈ పరేడ్ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు భారతీయ యోగా, ఆధ్యాత్మిక విలువలకు అద్దం పట్టే రీతిలో నృత్య సంగీత ప్రదర్శన కూడా చేయనున్నారు. ఇండియా గేట్ సమీపంలో ఉన్న జాతీయ యుద్ధ సంస్మరణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించడంతో 71వ గణతంత్ర వేడుకలు మొదలవుతాయి. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు మోదీ ఘన నివాళులు అర్పిస్తారు. ఇప్పటివరకు అమర జవాన్ జ్యోతి వద్దే నివాళి కార్యక్రమం ఉండేది. తొలిసారిగా ప్రధాని మోదీ వార్ మెమోరియల్‌కు వస్తున్నారు. అనంతరం రాజ్‌పథ్‌లో జరిగే కవాతు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర ప్రముఖులతో కలసి ప్రధాని వెళ్తారు. 21 తుపాకుల శాల్యూట్‌తో జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన జరుగుతాయి. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ సైనిక వందనాన్ని స్వీకరించిన అనంతరం రాజ్‌పథ్‌లో భారతీయ సైనిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రగతి వైభవం భిన్న కోణాల్లో ఆకృతుల్లో పురివిప్పుతుంది. సైన్యానికి చెందిన వివిధ రెజిమెంట్లు, వైమానిక దళానికి చెందిన ఆధునిక ఆయుధాల ప్రదర్శన కూడా ఈ సందర్భంగా జరుగుతుంది.
వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానం, తేజాస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను ప్రదర్శించనుంది. తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా బైకర్లు తమ అద్భుత సాహస క్రీడలతో అలరించనున్నారు. సుఖోయ్-30, ఎంకేఐ యుద్ధ విమానాలు చేసే నిరుపమాన గగన విన్యాసాలతో గణతంత్ర దినోత్సవం ముగుస్తుంది.
'చిత్రం... గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వసన్నద్ధంగా ముస్తాబైన ఢిల్లీలోని రాజ్‌పథ్