జాతీయ వార్తలు

పోలీసులకు పరిశోధకుల అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బాంగ (బీహార్), జనవరి 26: పీహెచ్‌డీ పరిశోధకులను వివాదస్పద ఎన్‌ఆర్‌సీ సర్వేయర్లుగా పొరపాటుపడిన గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యూఎస్‌కు చెందిన 12 మంది పీహెచ్‌డీ పరిశోధకులు బీహార్, దర్బాంగలోని జమాల్‌పుర్ పోలీసు స్టేషన్ పరిథిలోని ఓ గ్రామానికి చేరుకున్నారు. ఈ బృందం సభ్యుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా ఆ గ్రామంలోకి వెళ్ళిన 12 మంది పీహెచ్‌డీ పరిశోధకులు గ్రామస్థులను కలుసుకుని యక్ష ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. దీంతో ‘ఎన్‌ఆర్‌సీ సర్వేయర్లు’ గ్రామంలోకి చేరుకున్నారన్న వార్త దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు గుమిగూడారు. వారిని పట్టుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళి అప్పగించారు. పోలీసులకు అప్పగించిన వివరాలు, గుర్తింపు కార్డులు పరిశీలించి వారు పీహెచ్‌డీ పరిశోధకులని నిర్థారించుకున్నామని దర్బాంగ పోలీసు సూపరింటెండెంట్ బాబు రాం చెప్పారు. వారు ఎన్‌ఆర్‌సీ పరిశోధనకు రాలేదని, పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా గ్రామానికి వచ్చారని గ్రామస్థులకు నచ్చజెప్పి వెనక్కి పంపించామన్నారు. గ్రామస్థులు సంతృప్తి చెంది వెళ్ళిపోయారని చెప్పారు. పరిశోధకులను కూడా పంపించి వేశామని ఆయన తెలిపారు. ఇలాఉండగా ఎవరైనా పరిశోధన పేరిట గ్రామాలకు వచ్చినా, కదలికలు అనుమానస్పదంగా ఉన్నా తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా అన్ని గ్రామాల్లో ప్రజలకు ఇదివరకే చెప్పామని ఎస్‌పీ చెప్పారు. పరిశోధన లేదా ఏదైనా సమాచార నిమిత్తం గ్రామాల్లోకి వెళ్ళే వారు ముందుగానే స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎస్‌పీ సూచించారు.