జాతీయ వార్తలు

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలతో భారత ఆత్మకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 26: దేశంలోని సృజనాత్మక, విద్యారంగాలకు చెందిన 300కు పైగా మంది ప్రముఖులు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా ఒక బహిరంగ ప్రకటన చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇతరులకు వీరంతా తమ సంఘీభావం ప్రకటించారు. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ఫిల్మ్ మేకర్ మీరా నాయర్, గాయకుడు టీఎం కృష్ణ, రచయిత అమిత్ ఘోష్, చరిత్రకారిణి రొమిలా థాపర్ తదితరులు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా విడుదలయిన బహిరంగ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. సవరించిన పౌరసత్వ చట్టం, జాతీయ పౌర రిజిస్టరు- రెండూ కూడా భారతదేశ ఆత్మకు ముప్పేనని వారు ఇండియన్ కల్చరల్ ఫోరం (ఐసీఎఫ్)లో జనవరి 13న ప్రచురించిన ఒక నోట్‌లో పేర్కొన్నారు. ‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యితిరేకిస్తున్న, వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విద్యార్థులు, ఇతరులకు మేము సంఘీభావంగా నిలబడుతున్నాం. భారత రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమం కొనసాగిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం’ అని ఈ ప్రముఖులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మాలో చాలామందిమి అన్యాయాన్ని ఎదుర్కోవడంలో తరచుగా వౌనంగా ఉన్న విషయం మాకు తెలుసు. కాని, ఈ సమయంలో నెలకొన్న గంభీరత మన సూత్రాల కోసం మాలో ప్రతి ఒక్కరిని నిలబడేలా చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో రచయితలు అనితా దేశాయి, కిరణ్ దేశాయి, నటులు రత్న పాటక్ షా, జావేద్ జఫేరి, నందితా దాస్, లిల్లెట్ దూబే, సామాజికవేత్త ఆశిష్ నంది, హక్కుల కార్యకర్తలు సోహైల్ హష్మీ, షబానా హష్మీ కూడా ఉన్నారు.