జాతీయ వార్తలు

రికార్డు స్థాయిలో ‘ఆప్’ను గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: వచ్చే నెల ఎనిమిదో తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంపై ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తయిన ‘చీపురు’ను గట్టిగా ప్రెస్ చేసి గెలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ సోమవారం రోడ్ షో నిర్వహించారు. చలి వాతావరణంతో పాటు చిన్నపాటి చినుకులు పడుతున్నప్పటికీ రోడ్‌షోకు భారీగా జనం, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ.. 2015 రికార్డును మించే విధంగా ఓటువేసి మళ్లీ ఆప్‌కు అధికారం కట్టబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీలి రంగు ఓపెన్ టాప్ జీపులో జరిగిన రోడ్‌షోలో అభిమానులు, ప్రజలకు షేక్ హ్యాండ్ ఇస్తూ అందరినీ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఉత్తర డిల్లీలోని నరెలా, బవానా ప్రాంతాల్లో రోడ్‌షో జరిగింది. ఉచిత ఆరోగ్య సేవలు, విద్యుత్‌తోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఐదేళ్లలో చేసిందనీ.. వాటిని గుర్తించి తిరిగి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. రోడ్డుషోలో అభిమానులు నృత్యాలు చేస్తూ ఆప్ గీతం అయిన ‘లగే రహో కేజ్రీవాల్’ను ఆలపించారు.