జాతీయ వార్తలు

భారత్ అంతర్గత విషయాల్లో ఈయూ జోక్యం అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్ అంతర్గత వ్యవహారాల్లో బయటి దేశాలు జోక్యం చేసుకోవడం సరికాదని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై చర్చ, ఓటింగ్ చేపట్టాలని యూరోపియన్ పార్లమెంట్ తీసుకొన్న నిర్ణయాన్ని వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. యూరోపియన్ యూనియన్ చేసిన ప్రకటన నేపథ్యంలోనే ఉప రాష్టప్రతి మాట్లాడుతూ భారత అంతర్గత వ్యవహారాల్లో బయటి దేశాల ప్రమేయం ఎంతమాత్రం అవసరం లేదని నిర్దద్వంగా స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య ప్రసంగించారు. ‘ఇది పూర్తిగా భారత్ పార్లమెంట్ వ్యక్తిగత వ్యవహారం.. సమీప భవిష్యత్తులో భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌరసత్వ వ్యవహారంలో భారత్ తీసుకొన్న నిర్ణయం ‘ప్రమాదకరం’ అని ఈయూ పేర్కొంటూ దీనిపై చర్చ, ఓటింగ్ పెట్టాలనుకోవడం ఎంతమాత్రం సబబు కాదని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. భారత పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూలోని ఆరు గ్రూపులు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చ, ఓటింగ్‌కు పట్టుబట్టాయి. ఈమేరకు బుధవారం చర్చ జరగాలని, మర్నాడు ఓటింగ్ కూడా జరగాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.
దీనిని పూర్తిగా భారత్ ఖండించింది. ఇతర దేశాల వ్యవహారాల్లో వారు ఏవిధంగా జోక్యం చేసుకొంటారని ప్రశ్నించింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో.. అదీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు తీసుకొన్న నిర్ణయంపై జోక్యం చేసుకొనే హక్కు ఏ ఒక్క దేశానికీ ఉండబోదని.. పౌరసత్య సవరణ చట్టాన్ని ఉటంకిస్తూ భారత్ స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్.. భారత్ హక్కులు, బాధ్యతల అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉంటే నయం అంటూ హితవు పలికింది.

*చిత్రం... సభలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు