జాతీయ వార్తలు

హుబేయి నుంచి భారతీయుల తరలింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: కొత్త కరోనా వైరస్ పీడిస్తున్న చైనాలోని హుబేయి ప్రావిన్స్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకు రావడానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మంగళవారం తెలిపింది. బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ విషయమై చైనా ప్రభుత్వం, అధికారులు, అక్కడ ఉన్న భారత జాతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఎంఈఏ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ తెలిపారు. ‘చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఎన్‌కరోనా-2019 వైరస్ వ్యాపించడం వల్ల మేము అక్కడి నుంచి భారతీయులను తరలించడానికి సిద్ధమయ్యే ప్రక్రియను ప్రారంభించాం’ అని ఆయన మంగళవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ ఇందుకోసం కృషి చేస్తోంది. చైనా ప్రభుత్వం, అధికారులు, మన జాతీయులతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది’ అని కుమార్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చైనాలో ఈ కొత్త నావెల్ కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 106కు పెరిగింది. అలాగే, కొత్తగా సుమారు 1,300 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. చైనా నుంచి వస్తున్న వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేదానిని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ అనేది ఒక కొత్త రకం నిమోనియా. అధికారికంగా దీనిని 2019-ఎన్‌సీఓవీ అని పిలుస్తున్నారు. హుబేయి ప్రావిన్స్‌లోని వూహాన్, మరో 17 నగరాలు ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్నాయి. ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఈ నగరాలకు చెందిన వారే. సుమారు 250 నుంచి 300 మంది వరకు భారతీయ విద్యార్థులు వూహాన్‌లో చిక్కుబడిపోయారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు నెలకొన్నాయి.