జాతీయ వార్తలు

‘ఇతరులతో’ ఢిల్లీలో ప్రచారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: వచ్చే నెల 8వ తేదీన జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ‘ఇతరులను’ తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రజలను బీజేపీ అవమానిస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఇతర రాష్ట్రాల నుంచి 200 మంది ఎంపీలను, 70 మంది మంత్రులను, 11 మంది ముఖ్యమంత్రులను ప్రచారం కోసం బీజేపీ తీసుకువచ్చిందని ఆయన అన్నారు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ ప్రజల మద్దతు తమకెంతమాత్రం లేదని బీజేపీ భావించడమేనని మంగళవారంనాడు ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ అన్నారు. ఈ ‘ఇతరులు’ తననే కాకుండా ఢిల్లీ ప్రజలనే ఓడించడానికి ఇక్కడకు వచ్చారని ఆయన ఆరోపించారు. వీరంతా వచ్చి చెప్పేదేమిటంటే ‘మీ స్కూళ్లు బాగోలేవు, మీ క్లినిక్‌లు బాగోలేవు’ అని ఆయన అన్నారు. ఈ రకమైన దుష్ప్రచారాన్ని సహిస్తారా? అంటూ ప్రజలను ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు వచ్చినపుడు ఈ ఐదేళ్లకాలంలో జరిగిన అభివృద్ధిని వారికి వివరించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 200 మంది బీజేపీ ఎంపీలకు, ఢిల్లీ ప్రజలకు మధ్య సమరమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించే అవకాశం వారికి ఇవ్వకూడదని స్పష్టం చేసిన కేజ్రీవాల్ ‘ఈ ఐదేళ్లలో మీ కుటుంబ పెద్ద కొడుకుగా నేను పనిచేశాను. అందుకే విద్యుత్ బిల్లులు, వాటర్ బిల్లులు కట్టాను. ప్రతి కుటుంబానికీ విద్యా సౌకర్యాలను, ఆరోగ్యాన్ని కల్పించాను. అలాగే పెద్ద కొడుకుగా ఇంట్లో ఉన్న పెద్దలకు తీర్థయాత్రలకు వెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చాను’ అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ తరఫున ఎవరు ప్రచారానికి వచ్చినా వారిని ఆహ్వానిస్తూనే ‘మీది ఏ రాష్ట్రం. ఢిల్లీ గురించి మీకు తెలిసింది చెప్పండి’ అని ప్రశ్నించాలని అన్నారు. అలాగే తమ తమ రాష్ట్రాల్లో ఎన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతోందో, యూనిట్ రేటు ఏమిటో కూడా వారిని అడగాలని అన్నారు. అంతా విన్న తర్వాత తమకు 24 గంటలూ ఉచితంగానే విద్యుత్ అందుతోందన్న విషయాన్ని వారి మొహంమీదే చెప్పాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.
*చిత్రం... మాట్లాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్