జాతీయ వార్తలు

సమన్వయంతో సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, జనవరి 28: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలు సంబంధాలు కోరుకుంటోందని హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సమన్వయంతో ముందుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సెంట్రల్ జోనల్ కౌన్సిల్(సీజడ్‌సీ) సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సీజడ్‌సీ 22వ వార్షిక సమావేశం అమిత్ షా అధ్యతన జరిగింది. భద్రత, వౌలికవసతుల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని హోమ్ మంత్రి ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల నుంచి అదే కోరుకుంటోందని ఆయన చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతికి కేంద్రం అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తోందని ఆయన అన్నారు. సీఏఏ నేపథ్యంలో దేశంలో సహకార సమాఖ్యపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ పలు అంశాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అన్నారు. అయితే అంశాలేమిటన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాంటి ఘర్షణ వైఖరి ఉభయకులకు హాని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు సజావుగా నడిచే వాతావరణం కొరవడుతుందని కమల్‌నాథ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. సీజడ్‌సీ ఉపాధ్యక్షుడి హోదాలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. సమన్వయం, సమర్ధవంతమైన పాలన కోసం ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు దోహదపడతాయని కేంద్ర హోమ్ మంత్రి అన్నారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య మంచి సహకారం, సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని షా వెల్లడించారు. ‘ఒక విధంగా ఈ తరహా సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయి’అని ఆయన తెలిపారు.‘సమావేశానికి హాజరైన నలుగురు ముఖ్యమంత్రులు పలు సమస్యలు ప్రస్తావించారు. వనరుల కొరత, సమీకరణపై ఓ అంచనాతో వచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై బోలెడన్ని అంచనాలు ఉంటాయి. వాటిని తీర్చాల్సిన అవసరం కూడా ప్రజాప్రతినిధులపై ఉంటుంది’అని షా అన్నారు. రాష్ట్రాల అవసరాలు తీర్చేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్న హోమ్ మంత్రి ప్రకటించారు. ‘రాష్ట్రాలతో మంచి సమన్వయం కోరుకుంటున్నాం. బడ్జెట్‌కు సహకారం, అభివృద్ధి అలాగే శాంతి భద్రతల విషయంలో పరస్పర సహకారంతో ముందుకెళ్తాలి’అని ఆయన పిలుపునిచ్చారు. సీజడ్‌సీ సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు ఇద్దర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. భద్రత, వౌలిక ఉత్పత్తులు, అటవీ, పర్యావరణ సమస్యలపై చర్చించినట్టు సీజడ్‌సీ వర్గాలు వెల్లడించాయి.

*చిత్రం... కేంద్ర హోం మంత్రి అమిత్ షా