జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను అమలు చేయాలని పాకిస్తాన్‌ను భారత్ డిమాండ్ చేసింది. ‘పోరుగుదేశాల ప్రధాన విధానాలు-ప్రాంతీయ అవగాహన’ అనే అంశంపై ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఏర్పాటు చేసిన 12వ దక్షిణాసియా సదస్సులో పాల్గొన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పోరుగు రాష్ట్రాలతో శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక దేశంతో తప్ప, అన్ని పొరుగు రాష్ట్రాలతో సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతామని అన్నారు. భారత్ దేశం అనాదిగా శాంతిని కోరుకుంటున్నదని, ‘వసుధైక కుటుంబం’ అవసరమని భావిస్తున్నదని అన్నారు. ప్రపంచ శాంతిని ఉద్దేశించి పలు సంస్కృత శ్లోకాలను ఆయన ఈ సందర్భంగా వినిపించారు. పొరుగు దేశాలతో శాంతిని కోరుతున్నామని, ఆయా దేశాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిప్రాయమని రాజ్‌నాథ్ అన్నారు. 2014లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాల నేతలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా 2019లో మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బిమ్‌స్టెక్ నేతలను పిలిచారని చెప్పారు. పొరుగు దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటున్నదో, శాంతి స్థాపనకు ఎంతగా ప్రయత్నిస్తున్నదో ఈ రెండు సంఘటనలే స్పష్టం చేస్తున్నాయని రాజ్‌నాథ్ అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ముంబయి, పఠాన్‌కోట్, యూరి, పుల్వామా వంటి ఎన్నో ఉగ్రవాద దాడులకు పాక్‌లోని సంస్థలే ప్రధాన కారణమని చెప్పారు. ఆయా ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సర్కారు అన్ని విధాలా సహకరిస్తున్నదని ఆరోపించారు. ఒక దేశ ప్రభుత్వం ఈ విధంగా పొరుగు దేశంపై దాడుల చేసేందుకు ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాటల గారడీని విడిచిపెట్టి, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే దిశగా కార్యాచరణను చేపట్టాలని కోరారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతునిస్తున్నంత కాలం, ఆ దేశంతో శాంతి చర్యలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు.