జాతీయ వార్తలు

ప్లాస్టిక్ వాడకంపై తాజా నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్లాస్టిక్ వాడకంపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు సరికొత్తగా చేపట్టిన విధివిధానాలపై స్పష్టమైన తాజా నివేదికను సమర్పించాల్సిందిగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ)ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశించింది. ఆయా సంస్థలు వస్తువుల సరఫరా కోసం చేసే ప్యాకింగ్‌లలో ప్లాస్టిక్‌ను ఏ స్థాయిలో వాడుతున్నారో తెలియజేయాల్సిందిగా కోరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అతిగా ప్లాస్టిక్‌ను వాడుతున్నాయని, ఈ వినియోగానికి బ్రేక్ వేయాలని 16 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసును విచారించిన ఎన్‌జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ హాజరుకాగా, సీపీసీబీ తరఫున వాదిస్తున్న బాలేందు శేఖర్ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమేకాక, వ్యర్థాలు ఎక్కువగా లేకుండా చూసేందుకు సరికొత్త నియమనిబంధనలు ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ కామర్స్ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను సరఫరా చేయడానికి కొన్ని నియమనిబంధనలను అనుసరించి ప్లాస్టిక్‌ను వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సమర్పించి, సంబంధిత ప్రభుత్వ శాఖలు, అధికారుల నుంచి సర్ట్ఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అమెజాన్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది సంజీవ్ ఉపాధ్యాయ తన వాదనను కొనసాగిస్తూ ప్లాస్టిక్ వినియోగంపై కంపెనీ దృష్టి పెట్టిందని అన్నారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా ప్రాథమికంగా పూర్తి చేయాల్సిన అన్ని పనులను పూర్తి చేస్తామని ఆయన కోర్టుకు చెప్పారు. వాదనలను విన్న తర్వాత కేసును ఎన్‌జీటీ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పట్లోగా పూర్తి సమాచారంతో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్లాస్టిక్ వినియోగంపై అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.