జాతీయ వార్తలు

నన్ను బెదిరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని బీజేపీ పార్లమెంటు సభ్యుడు పర్వేష్ వర్మ అన్నారు. షహీన్‌బాగ్‌లో ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ, సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కాగా, అప్పటినుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం 8.11 నిమిషాలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి హతమారుస్తానని హెచ్చరించినట్టు ఆయన పేర్కొన్నారు. తాను వెంటనే బారాకంభా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలావుంటే, వర్మ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఓ సీనియర్ పోలీస్ అధికారి ధృవీకరించారు. విచారణ మొదలుపెట్టామని, వివరాలు త్వరలోనే తెలుస్తాయని ఆయన అన్నారు. సీఏఏ ఆందోళనకారులు ఇళ్లల్లోకి చొరబడి మహిళలపై అత్యాచారం చేసి, వారి హతమారుస్తున్నారని వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక వర్గంపై అనుమానాలు రేకెత్తించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. కాశ్మీరీ పండిట్ల ఊచకోత మాదిరిగానే ఢిల్లీలోని హిందువులపై దాడులు, హత్యలు తప్పవని వర్మ పేర్కోవడాన్ని ఫిర్యాదుదారులు తప్పుపట్టారు.