జాతీయ వార్తలు

80శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: దేశంలో నగదు పరిస్థితి వేగంగా, మెరుగవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2.2లక్షల ఏటీఎంలలో 80 శాతం బుధవారం మామూలుగా పనిచేశాయని అధికారవర్గాలు తెలిపాయి. నగదు కోసం అసాధారణగా పెరిగిన డిమాండ్ కారణంగా ఒక్కసారిగా బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మరికొని రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర నగదు కొరత కొనసాగుతోంది. మరోపక్క ప్రభుత్వం, ఆర్‌బీఐలు నగదు కొరత లేదంటూ ప్రకటించినా వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. రెండు రోజుల క్రితం దేశంలో కేవలం 60 శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేయగా, బుధవారం 80 శాతం మామూలుగా పనిచేశాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సగటున నిర్దిష్ట కాలంలో 10-12 శాతం ఏటీఎంలు మెయింటెనెన్స్‌కోసం లేదా మరే ఇతర కారణాలవల్ల పనిచేయవు. మిగిలిన 88 శాతం ఏటీఎంలు పనిచేస్తాయని అధికార వర్గాలు వివరించాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ, బ్యాంకులు, క్యాష్ లాజిస్టిక్ కంపెనీల సమన్వయ కృషితో పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని అధికార్లు వెల్లడించారు. భారత్‌లో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఒక ప్రకటన చేస్తూ, గత 24 గంటల్లో ఏటీఎంలలో నగదు పరిస్థితి బాగా మెరుగైందని వెల్లడించింది. నగదు కొరతపై మొట్టమొదట ఫిర్యాదులు అందింది అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి. గత రెండేళ్ల కాలంలో అత్యధిక నగదును పొందిన ఈ రాష్ట్రాలనుంచే నగదుకొరత ఫిర్యాదు రావడం విచిత్రం. పెద్ద నోట్లను దాచిపెట్టడం ఇందుకు కారణం కావచ్చని అధికార్లు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ సమాచారం ప్రకారం 2016 నవంబరు నుంచి 2017 మార్చి వరకు రూ.82,168 కోట్లను హైదరాబాద్ ఆర్‌బీఐ కార్యాలయానికి పంపారు. దేశంలోని అన్ని ఆర్‌బీఐ కార్యాలయాలకు పంపిన నగదు కంటే ఇది అధికం. అదేవిధంగా 2017, ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు రూ.51,523 కోట్లు హైదరాబాద్‌కు సరఫరా అయ్యాయి. ఇదికూడా దేశంలోని ఇతర ఆర్‌బీఐ కార్యాలయాలకంటే అధికం. గత ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు హైదరాబాద్ ఆర్‌బీఐకి మరో 5వేల కోట్లను పంపారు.