జాతీయ వార్తలు

‘హిందూ టెర్రర్’ సృష్టికర్త మీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ కవి, పాటల రచయిత జావేద్ అక్తర్, బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పరస్పర ఆరోపణలకు దిగారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో విజయం సాధించినందుకు జాతీయ దర్యాప్తు సంస్థను అభినందిస్తున్నానని జావేద్ అక్తర్ బుధవారం ట్వీట్ చేశారు. దీనికి నరసింహారావు ప్రతిట్వీట్ చేస్తూ ‘హిందూ టెర్రర్ పదం సృష్టికర్త మీరేనా?’ అంటూ ఎదురుదాడి చేశారు. స్వామి అసీమానంద మరో నలుగురు నిందితులు నిర్దోషులని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వటం తెలిసిందే. జావేద్ అక్తర్ ఈ తర్పుపై స్పందిస్తూ ‘మిషన్ అకాంప్లిష్డ్, మై కంగ్రాచ్యులేషన్స్ టు ఎన్‌ఐఏ ఫర్ దేర్ గ్రాండ్ సక్సెస్ ఇన్ మక్కా మజీద్ కేస్. నవ్ దె హావ్ ఆల్ ది టైం ఇన్ ది వరల్డ్ టు ఇనె్వస్టిగేట్ ఇంటర్- కమ్యూనిటీ మ్యారేజెస్’ అంటూ ట్వీట్ చేశారు. ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ అని చెప్పటం ద్వారా జావేద్ అక్తర్ కేరళకు చెందిన హిందూ యువతి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని మతం మార్చుకున్న హైదియా గురించి పరోక్షంగా ప్రస్తావించారు. జాతీయ దర్యాప్తు సంస్థ హైదియా కేసుపై దర్యాప్తు కొనసాగించటం తెలిసిందే. హైదియా కేసులో లవ్ జిహాద్ కోణమేదైనా ఉన్నదా అనేది కూడా ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. జావేద్ అక్తర్ చేసిన ఈ ట్వీట్‌పై నరసింహారావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫ్యాన్‌గా మారిపోయారా? కాంగ్రెస్ పార్టీ కోసం హిందూ టెర్రర్ పద ప్రయోగం మీరే చేశారా? అని నరసింహారావు ఆయనను నిలదీశారు.
యూపీఏ హోం శాఖ మంత్రులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ హిందూ టెర్రర్ పదాన్ని ప్రయోగించటం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా హిందూ టెర్రర్ అనే పదాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీని ఖండించవలసిన మీరు.. ఇలా విమర్శలు గుప్పించటం మంచిది కాదని అక్తర్‌కు స్పష్టం చేశారు. మీరు హిందీ సినిమాలకోసం కల్పిత మాటలు రాసినట్లే కాంగ్రెస్‌కోసం కూడా కల్పిత పదాలను సృష్టిస్తున్నారు.. మీరు రాహుల్ గాంధీ ప్రభావంలో ఉన్నట్లుంది అంటూ నరసింహారావు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలో గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘మృత్యు వ్యాపారి’ అని ఆరోపించటం తెలిసిందే. సోనియా గాంధీ ఉపయోగించిన ఈ పదాన్ని జావేద్ అక్తర్ రాసి ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది.